CM Chandrababu: ఢిల్లీలో రెండురోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన
ABN, Publish Date - May 22 , 2025 | 06:26 PM
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం నాడు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పలువురు కేంద్రమంత్రులతో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. శుక్ర, శనివారాల్లో పలువురు కేంద్రమంత్రులను ఢిల్లీలో (Delhi) కలవనున్నారు. ఇవాళ(మే22) సాయంత్రం ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు రాత్రి 8గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు(మే23) రక్షణ, హోం, ఆర్థిక, జలశక్తి, ఎలక్ట్రానిక్స్ ఐటీ, శాస్త్ర సాంకేతిక, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రులతో సమావేశం కానున్నారు. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్, నీటి వనరుల నిర్వహణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంపై దృష్టి సారించనున్నారు.
నూతన క్రిమినల్ చట్టాల అమలు తీరుతెన్నులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్వహించే సమీక్షకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. రేపు(శుక్రవారం) ఉదయం 10గంటలకు పునరుత్పాదక ఇంధన శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం అవుతారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఏపీకి సహకారం అందించాలని కోరనున్నారు. ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమవుతారు. BEL డిఫెన్స్ కాంప్లెక్స్, HAL-AMCA కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్‌లో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు జలశక్తి శాఖా మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు.
మధ్యాహ్నం 1 గంటకు చంద్రబాబును సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ కలవనున్నారు. సాయంత్రం 3 గంటలకు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చిస్తారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోం మంత్రి అధ్యక్షతన కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై సమీక్షకు హాజరుకానున్నారు. రాత్రి 9గంటలకు చంద్రబాబును కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కలవనున్నారు. 24వ తేదీన భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి సీఎం చంద్రబాబు, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ హాజరుకానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: ఇది మనందరి బాధ్యత.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Tirumala: తిరుమలలో ఓ వ్యక్తి బహిరంగంగా చేసిన పని చూస్తే
ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ
AP Ration Card: రేషన్‌కార్డులపై ఆందోళన వద్దు.. ఇది నిరంతర ప్రక్రియ
Read latest AP News And Telugu News
Updated Date - May 22 , 2025 | 06:35 PM