Share News

Tirumala: తిరుమలలో ఓ వ్యక్తి బహిరంగంగా చేసిన పని చూస్తే

ABN , Publish Date - May 22 , 2025 | 03:50 PM

Tirumala: తిరుమలలో అన్యమతస్థుడు బహిరంగంగానే నమాజ్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. నిత్యం స్వామివారి చెంత కళ్యాణం చేసుకుని వచ్చే భక్తులతో కళ్యాణ వేదిక ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది.

Tirumala: తిరుమలలో ఓ వ్యక్తి బహిరంగంగా చేసిన పని చూస్తే
Namaz In Tirumala

తిరుమల, మే 22: తిరుమలలో (Tirumala) అపచారం చోటు చేసుకుంది. శ్రీనివాసుడి సన్నిధిలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అన్యమతస్థుడు నమాజ్ (Namaz) చేయడం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలకి ఎదురుగానే అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. పురోహిత సంఘం వద్దే ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఇలా చేయడం ఏంటని.. భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహిస్తున్నారు.


పాపవినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక సమీపంలోని పురోహిత సంఘంలో ఓ అన్యమతస్థుడు బహిరంగంగానే నమాజ్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. నిత్యం స్వామివారి చెంత కళ్యాణం చేసుకుని వచ్చే భక్తులతో కళ్యాణ వేదిక ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ ప్రాంతం వద్ద ఓ వ్యక్తి నమాజ్ చేయడాన్ని చూసిన భక్తులు భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఆ అన్యమతస్థుడు అక్కడే తమిళనాడకు చెందిన వాహనంలో ఉన్నాడు. దీంతో అతని వద్దకు వెళ్లి తిరుమలలో అన్యమత కార్యకాలాపాలు సాగించకూడదు కదా.. ఇక్కడే నమాజ్ చేయడానికి కారణం ఏంటని ప్రశ్నించగా.. తాను నమాజ్ చేసుకుంటానని ఇక్కడున్న వారిని అడిగితే వాళ్లేమీ పట్టించుకోలేదని, అందుకే తానిక్కడే నమాజ్ చేసుకున్నట్లు సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు.


అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్న ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలను ద్వారా అయినా భద్రతా సిబ్బంది దాన్ని గుర్తించి వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ కంట్రోల్‌ రూంలో ఉన్న భద్రతా సిబ్బంది స్పందకపోవడంతో అన్యమతస్థుడు అక్కడే దర్జాగా పది నిమిషాల పాటు నమాజ్ చేశారు. ఆ తర్వాత పార్కింగ్‌లో ఉన్న కారులో ఉండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ ఘటన జరిగినప్పటికీ టీటీడీ భద్రతా సిబ్బంది, పోలీసులు కానీ దీనిపై స్పందించని పరిస్థితి. అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడండి.


ఇవి కూడా చదవండి

ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ

AP Ration Card: రేషన్‌కార్డులపై ఆందోళన వద్దు.. ఇది నిరంతర ప్రక్రియ

Read latest AP News And Telugu News

Updated Date - May 22 , 2025 | 05:02 PM