AP Government: సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం యోచన
ABN, Publish Date - Jun 17 , 2025 | 03:17 PM
సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ(మంగళవారం) సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరావతి: సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం (AP Government) యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ(మంగళవారం) సర్క్యులర్ ఎకానమీపై రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సర్క్యులర్ ఎకానమీ పార్కులపై సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై సమీక్షలో చర్చించారు.
అయితే ‘మెటీరియల్ రీసైక్లింగ్‌కి అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11 రంగాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. మున్సిపల్, వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం, టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్థాల నుంచి సర్క్యులర్ ఎకానమీ సృష్టించేలా కేంద్రప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. వీటికి అదనంగా గనులు, చేనేత, పశుసంవర్థక శాఖలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నగర పాలక సంస్థలు, పంచాయతీల్లో జీరో వేస్ట్ లక్ష్య సాధనకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఇవి కూడా చదవండి
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 17 , 2025 | 05:01 PM