ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: కోనసీమ జిల్లాలో విషాదం.. స్నానానికి వెళ్లిన ఎనిమిది..

ABN, Publish Date - May 26 , 2025 | 06:09 PM

కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న గోదావరిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Konaseema District Tragedy

కోనసీమ: జిల్లాలోని ముమ్మిడివరం (Mummidivaram) మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. శుభాకార్యానికి వచ్చిన యువకులు గోదావరిలో (Godavari River) మిస్ అయ్యారు. స్నానం చేయడానికి వెళ్లిన 8 మంది యువకులు.. ఆ నీటిలోనే గల్లంతయ్యారు. ఈ ఘటన ముమ్మిడివరం మండలం కమిని లంక సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కె.గంగవరం మండలం శేరులంక గ్రామంలో ఓ శుభకార్యానికి కాకినాడ, రామచంద్రపురం, మండపేట గ్రామాల నుంచి పలు కుటుంబాలవారు వచ్చారు.


సమీపంలోని గోదావరిలో స్నానానికి 11మంది యువకులు వెళ్లారు. వీరిలో ఎనిమిది మంది గల్లంతయ్యారు. కాకినాడకు చెందిన నలుగురు క్రాంతి(20), పాల్ (18), సాయి (18), సతీష్ (19) ఐ.పోలవరం మండలం ఎర్రగరువు గ్రామానికి చెందిన మహేష్, రాజేష్ (13), మండపేటకు చెందిన రోహిత్, శేరులంకకు చెందిన మహేష్‌లు గోదావరిలో గల్లంతయ్యారు. ఈ విషయం తెలియడంతో యువకుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయా కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి. పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు గోదావరిలో దిగి యువకుల కోసం వెతుకుతున్నారు. వారి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో టెన్షన్ పడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మళ్లీ అనారోగ్యం.. జీజీహెచ్‌కు వల్లభనేని వంశీ

సర్పంచ్ వేధింపులు.. ప్రాణహానీ అంటూ మహిళ ఫిర్యాదు

Read Latest AP News And Telugu News

Updated Date - May 26 , 2025 | 06:23 PM