ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Huge Fraud: వైసీపీ హయాంలో మరో భారీ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు..

ABN, Publish Date - Jun 14 , 2025 | 07:31 AM

వైసీపీ ప్రభుత్వం హయాంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. పదోన్నతుల పేరుతో గంగమ్మ గుడి భజంత్రీలకు వైసీపీ నేతలు టోకరా పెట్టారు. ఐదుమంది భజంత్రీలకు గ్రేడ్- 2 నుంచి గ్రేడ్ -1 కళాకారులుగా పదోన్నతి పేరుతో నకిలీ ఉత్తర్వులు జారీ చేశారు.

Huge Fraud in YSRCP Govt

తిరుపతి: గత వైసీపీ (YSRCP) ప్రభుత్వ హయాంలో జరిగిన మోసాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. గత జగన్ ప్రభుత్వంలో అందినకాడికి దోచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బాధితులు వరుసగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మరో భారీ మోసం బయటపడింది. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. అక్రమాలకు పాల్పడిన వారెవరైనా చర్యలు తప్పవని హెచ్చరించింది.

వైసీపీ ప్రభుత్వంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. పదోన్నతుల పేరుతో గంగమ్మ గుడి భజంత్రీలకు వైసీపీ నేతలు టోకరా పెట్టారు. ఐదుమంది భజంత్రీలకు గ్రేడ్- 2 నుంచి గ్రేడ్ -1 కళాకారులుగా పదోన్నతి పేరుతో నకిలీ ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఒకరికి నిబంధనలకు విరుద్దంగా రికార్డ్ అసిస్టెంట్‌గా పదోన్నతి ఇవ్వడంపై అనుమానం రావడంతో కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది. పదోన్నతుల కోసం భజంత్రీల నుంచి పెద్ద మొత్తంలో వైసీపీ నేతలు నగదు వసూలు చేసినట్లు గుర్తించింది. నకిలీ ఉత్తర్వులతో పదోన్నతి పొందారని భజంత్రీలపై తిరుపతి ఈస్ట్ పోలీసులకు దేవాదాయ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దేవదాయ శాఖ వద్ద ఎలాంటి ఫైల్ లేకపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న గంగమ్మ గుడి కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నకిలీ ఉత్తర్వులతో పదోన్నతి పొందిన ఐదుమంది భజంత్రీలపై కేసు నమోదు కావడంతో వారిని దేవాదాయ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది.

ఇవి కూడా చదవండి

విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ..

తల్లుల ఖాతాల్లోకి నిధులు.. ఆనందంలో కుటుంబాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 08:09 AM