ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Students Shine: తెలంగాణ ఎప్‌సెట్‌లో ఏపీ కుర్రోళ్ల హవా

ABN, Publish Date - May 12 , 2025 | 03:49 AM

తెలంగాణ ఎప్‌సెట్‌లో ఏపీకి చెందిన విద్యార్థులు అద్భుతం చూపించారు, ఇంజనీరింగ్‌లో తొలి మూడు ర్యాంకులూ వారి ఖాతాలోనే ఉన్నాయి. ఫార్మసీ, అగ్రికల్చర్‌లోనూ టాప్‌-10లో అబ్బాయిలే ఎక్కువగా నిలిచారు

  • ఇంజనీరింగ్‌లో తొలి 3 ర్యాంకులూ మనోళ్లకే

హైదరాబాద్‌/జియ్యమ్మవలస/విజయనగరం, మే 11 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎప్‌సెట్‌-2025లో అబ్బాయిలు సత్తా చాటారు. ముఖ్యంగా ఏపీకి చెందిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో తొలి మూడు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. మరోవైపు.. ఇంజనీరింగ్‌లో టాప్‌-10 ర్యాంకుల్లో అంతా బాలురే నిలిచారు. అగ్రికల్చర్‌, ఫార్మసీలోనూ టాప్‌-10లో 9 ర్యాంకులను అబ్బాయిలే కైవసం చేసుకున్నారు. ఆదివారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎప్‌సెట్‌ ఫలితాలను విడుదల చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుణానుపురం గ్రామానికి చెందిన పల్లా భరత్‌చంద్ర 150.05 మార్కులతో టాపర్‌(1)గా నిలిచాడు. నంద్యాల జిల్లా కోనాపురం గ్రామానికి చెందిన ఉడగండ్ల రామచరణ్‌రెడ్డి 148.28 మార్కులతో రెండో ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన పమ్మిన హేమసాయి సూర్య కార్తీక్‌ 147.08 మార్కులతో మూడోర్యాంకు దక్కించుకున్నాడు. ఫార్మసీ, అగ్రికల్చర్‌లో హైదరాబాద్‌కు చెందిన సాకేత్‌రెడ్డి 141.68 మార్కులతో టాపర్‌(1)గా నిలిచాడు.


చదువుల చంద్ర!

ఎప్‌సెట్‌లో టాపర్‌గా నిలిచిన భరత్‌చంద్ర జేఈఈ మెయిన్స్‌ 2025లో ఆలిండియా 121వ ర్యాంకు, ఆలిండియా ఓబీసీ కోటాలో 17వ ర్యాంకు సాధించాడు. భరత్‌చంద్ర తండ్రి రామకృష్ణ విజయనగరంలోని మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా, తల్లి దమయంతి శ్రీకాకుళం జిల్లా బెలమం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మదర్స్‌డే రోజున తన కుమారుడు మంచి బహుమతి ఇచ్చాడంటూ దమయంతి ‘ఆంధ్రజ్యోతి’తో సంతోషాన్ని పంచుకున్నారు.

ముంబై ఐఐటీలో చదువుతా: రామ్‌చరణ్‌రెడ్డి

తెలంగాణ ఎప్‌సెట్‌లో రెండో ర్యాంకు సాధించినందుకు సంతోషంగా ఉందని రామచరణ్‌రెడ్డి అన్నాడు. ముంబై ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవటమే తన లక్ష్యమని చెప్పాడు. జేఈఈ మెయిన్స్‌లో 51వ ర్యాంకు సాధించిన రామచరణ్‌ రెడ్డి ప్రస్తుతం అడ్వాన్స్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. రామచరణ్‌రెడ్డి స్వస్థలం నంద్యాల జిల్లా కోనాపురం గ్రామం. తండ్రి కృష్ణారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయడు కాగా, తల్లి సచివాలయం ఉద్యోగిగా ఉన్నారు.


ఐఐటీ సీటే లక్ష్యం: సూర్యకార్తీక్‌

తెలంగాణ ఎప్‌సెట్‌లో విజయనగరం జిల్లాకు చెందిన బి. హేమసాయి సూర్యకార్తీక్‌ మూడోర్యాంకు సాధించాడు. విజయనగరంలోని అయ్యన్నపేటకు చెందిన కార్తీక్‌ జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియాలో 75 ర్యాంకు పొందాడు. ఐఐటీలో సీటు సాధించాలనే లక్ష్యంతోఉన్నట్లు కార్తీక్‌ తెలిపాడు. కార్తీక్‌ తండ్రి జగన్మోహనరావు విజయనగరంలోనే చైతన్య డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు

Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు

Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..

Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన

Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్

For Andhrapradesh news and Telugu News

Updated Date - May 12 , 2025 | 03:49 AM