ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రి మండిపల్లి తీవ్ర విచారం

ABN, Publish Date - Jun 30 , 2025 | 10:12 AM

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆరా తీశారు. ఈ ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Minister Mandipalli Ramprasad Reddy

అన్నమయ్య: జిల్లాలోని కురబలకోట మండలం దొమ్మన బావి వద్ద జాతీయ రహదారిపై ఇవాళ (సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. టెంపో ట్రావెలర్‌ని లారీ ఢీ కొట్టింది. టెంపో ట్రావెలర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే.. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి (Minister Mandipalli Ramprasad Reddy) ఆరా తీశారు. ఈ ప్రమాదంపై మంత్రి మండిపల్లి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించాలని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రి అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి మండిపల్లి సంతాపం తెలిపారు. రవాణా అధికారులు ఘటన స్థలంలో త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మంత్రి మండిపల్లి ఇవాళ(సోమవారం) ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి:

సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్ షాప్

ఆర్నెల్లలో పోలీసు శాఖలో ఏఐ యాప్‌లు

For More AP News and Telugu News

Updated Date - Jun 30 , 2025 | 10:17 AM