ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Raghunandan Rao: కేసీఆర్ గర్వం వల్లే బీఆర్ఎస్‌ను వీడుతున్న నేతలు

ABN, Publish Date - Apr 05 , 2024 | 10:51 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) గర్వం వల్లనే నేడు ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని.. ఆ పార్టీలో ఇక ఎవరు ఉండరని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘు నందన్ రావు (Raghunandan Rao) అన్నారు.

సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) గర్వం వల్లనే నేడు ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని.. ఆ పార్టీలో ఇక ఎవరు ఉండరని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘు నందన్ రావు (Raghunandan Rao) అన్నారు. శుక్రవారం నాడు జిల్లా కేంద్రంలోని శరబేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 17వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీకి ఓటేయాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో రఘు నందన్ రావు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, చికోటి ప్రవీణ్ పాల్గొన్నారు.


Kishan Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు..

ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ... బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి కి ఈ జిల్లాకు ప్రత్యేకమైన అనుబందం ఏం లేదన్నారు. మెదక్ జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఉద్యమకారులు ఎవరు కనపడలేదా అని ప్రశ్నించారు. వెంకట్ రాంరెడ్డి ఎమ్మెల్సీగా 2021లో ఎన్నిక అయ్యాక నేటికీ సిద్దిపేట గడ్డకు ఎందుకు రాలేదని నిలదీశారు. ఆయన పదేళ్లు కలెక్టర్‌గా ఉండి పది పైసలైన సిద్దిపేటకు ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. కలెక్టర్ జీతం లక్ష రూపాయలు అయితే వెయ్యి కోట్లు పెట్టీ వంద ఎకరాల స్థలాన్ని ఎలా కొన్నారని నిలదీశారు.


సిద్దిపేటలో హరీష్‌రావుపై ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాంగ్రెస్ నేతకు డిపాజిట్ రాలేదని.. ఆయన కొబ్బరి కాయలు కొడితే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. దేశం, ధర్మం కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వంలో పోన్ ట్యాపింగ్‌లో భార్య భర్తల పోన్లు విన్నారని చెప్పారు.


Danam Nagender: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

2018లో కేసీఆర్ ఏం మాట్లాడాడో.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మంత్రిగా ఈ జన్మలో కలలో కూడా కాడని ఎద్దేవా చేశారు. 500 ఏళ్లు ఎవరికి చేతగాని పనిని అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేశారని చెప్పారు. మోదీ గెలిచే 400 సీట్లలో మెదక్ ‌లో కూడా బీజేపీ జెండా ఎగురవేయాలని చెప్పారు. ఎంపీగా తనను గెలిపించాలని రఘునందన్ రావు కోరారు.


కేసీఆర్ అహంకారం వల్లే ఓటమి: వెంకటరమణ రెడ్డి

అపజేయం తెల్వని కేసీఆర్‌ని, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ కార్యకర్త ఓడించాడని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి(Venkata Ramana Reddy) అన్నారు. దేశంలోని పల్లెలను ప్రధాని మోదీ అభివృద్ధి చేశారని చెప్పారు. కేసీఆర్ అహంకారం వల్లే ప్రజలు ఓడించారన్నారు. తెలంగాణలోని 17ఎంపీ స్థానాలు బీజేపీ గెలిచే విధంగా కార్యకర్తలు పనిచేయాలని వెంకట్ రమణ రెడ్డి సూచించారు.

Shanti Swaroop: మూగబోయిన తొలి తెలుగు న్యూస్ రీడర్ స్వరం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 05 , 2024 | 11:03 PM

Advertising
Advertising