ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi Liquor Scam: కవితను అక్రమంగా అరెస్ట్ అనే దానిలో పసలేదు.. ఈడీ వాదనలు

ABN, Publish Date - Apr 24 , 2024 | 03:06 PM

Telangana: ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మొదలైంది. బుధవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ మొదలవగా.. ఈడీ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ కవిత పిటిషన్ దాఖలు చేయగా.. గత రెండు రోజులుగా కోర్టులో విచారణ జరుగుతోంది. నిన్నటి (మంగళవారం) విచారణలో కవిత తరపున న్యాయవాది నితేష్ రానా... ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో (Delhi Liquor Scam) బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavita) బెయిల్ పిటిషన్‌పై విచారణ మొదలైంది. బుధవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో (delhi Rouse Avenue Court) విచారణ మొదలవగా.. ఈడీ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ కవిత పిటిషన్ దాఖలు చేయగా.. గత రెండు రోజులుగా కోర్టులో విచారణ జరుగుతోంది. నిన్నటి (మంగళవారం) విచారణలో కవిత తరపున న్యాయవాది నితేష్ రానా... ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు.

AP Polls 2024: బొత్స తండ్రి సమానులా జగన్.. షర్మిల ఫైర్!


ఈడీ వాదనలు ఇవే..

సెక్షన్ 19 కింద కవితను చట్టబద్దంగా అరెస్టు చేశామని.. అక్రమంగా అరెస్టు చేశారనే దానిలో పసలేదని పేర్కొంది. ‘‘ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగింది. 581 కోట్ల రూపాయలు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారు. అయిదు నుంచి 12 శాతానికి కమీషన్ పెంచారు. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకి నష్టం జరిగింది. ఈ పాలసీలో ఇండో స్పిరిట్ కు మేజర్ షేర్ దక్కింది. దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారు. పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారు. విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపారు. విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు . అసాధారణ లాభాలు గడించారు. బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారు’’ ఈడీ వాదనలు వినిపిస్తోంది. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.

Viral: బాయ్‌ఫ్రెండ్‌కు ఫోన్లు, మెసేజ్‌లు.. లిఫ్ట్ చేయకపోతే వింత పనులు.. చివరకు డాక్టర్లు ఏం తేల్చారంటే..


మొదట కేజ్రీవాల్‌ను కలిసింది ఆయనే..

లిక్కర్ వ్యాపారంలో భాగస్వామ్యం కోసం మొదట కేజ్రీవాల్‌ను మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారని ఈడీ న్యాయవాది తెలిపారు. సౌత్ నుంచి కొందరు వ్యాపారం చేయడానికి ముందుకొచ్చారు కవితను కలవమని మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కేజ్రీవాల్ చెప్పారన్నారు. హైదరాబాద్‌లో కవితను శ్రీనివాసులు రెడ్డి కలిసినప్పుడు కేజ్రీవాల్ రూ.100 కోట్లు అడిగారని రూ.50 కోట్లు సమకూర్చాలని శ్రీనివాసులు రెడ్డిని కవిత అడిగారు. అనంతరం అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబుకు రాఘవ రూ.25 కోట్లు ఇచ్చారన్నారు. బుచ్చిబాబు చాట్స్‌ను వాదనలు సందర్భంగా కోర్టులో ఈడీ న్యాయవాది ప్రస్తావించారు.


‘‘లిక్కర్ వ్యాపారంలో కవితకు 33 శాతం వాటకోసం బుచ్చిబాబు పనిచేసారు. ముడుపుల ద్వారా ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత భగస్వామ్యం పొందారని మాగుంట రాఘవ స్టేట్మెంట్ ఇచ్చారు. మాగుంట రాఘవ సిబ్బంది గోపీకుమార్ రూ.25 కోట్లను రెండు విడతలుగా బుచ్చిబాబు, బోయినపల్లికి ఇచ్చినట్లు వాంగ్మూలం ఇచ్చారు. కవితను శరత్ రెడ్డి హైదరాబాద్‌లో కలిశారు. ఆప్ కి ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపులో శరత్ చంద్ర రెడ్డి కొంత మొత్తాన్ని ఇచ్చారు’’ అంటూ ఈడీ వాదనలు వినిపించింది.


ఇవి కూడా చదవండి...

AP Elections: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. ఆ ఇద్దరూ ఎదురు తిరిగారు!

Viral Video: అదేంటి.. కుక్కను చూసి మొసలి అంత వేగంగా పరిగెత్తంది.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 24 , 2024 | 03:15 PM

Advertising
Advertising