Share News

AP Polls 2024: బొత్స తండ్రి సమానులా జగన్.. షర్మిల ఫైర్!

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:11 PM

Andhrapradesh: మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బొత్స.. జగన్‌కు తండ్రి సమానులు అంటూ ఓ వార్తను ఈరోజు ఉదయం పేపర్‌లో చూశానని.. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్సార్‌ను తిట్టిపోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రేపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల మాట్లాడుతూ...

AP Polls 2024: బొత్స తండ్రి సమానులా జగన్.. షర్మిల ఫైర్!

అమరావతి, ఏప్రిల్ 24: మంత్రి బొత్స సత్యనారాయణపై (Minister Botsa Satyanarayana) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి (APCC Chief YS Sharmila Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బొత్స.. జగన్‌కు (CM Jagan) తండ్రి సమానులు అంటూ ఓ వార్తను ఈరోజు ఉదయం పేపర్‌లో చూశానని.. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్సార్‌ను తిట్టిపోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రేపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల మాట్లాడుతూ... ‘‘ఇదే బొత్స వైఎస్సార్‌ను త్రాగుబోతు అని తిట్టాడు. ఇదే బొత్స జగన్‌కు ఉరి శిక్ష వేయాలని అన్నాడు. జగన్ మోహన్ రెడ్డి బినామీలు అన్నాడు. విజయమ్మ ను సైతం అవమాన పరిచాడు. ఇలాంటి బొత్స జగన్‌కు తండ్రి సమానులు అయ్యారు’’ అంటూ ఎద్దేవా చేశారు.

Loksabha polls: బీఆర్ఎస్‌‌ను వీడటంపై కారణాలేంటో చెప్పిన రంజిత్ రెడ్డి


వైఎస్సార్సీపీలో వైఎస్సార్ లేరు...

జగన్ క్యాబినెట్‌లో ఉన్న వాళ్ళందరు వైఎస్సార్‌ను తిట్టిన వాళ్ళే అని విరుచుకుపడ్డారు. వైఎస్సార్‌ను తిట్టిన వాళ్ళకే జగన్ పెద్దపీట వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళందరూ తండ్రులు,అక్కలు,చెల్లెల్లు అంటూ సెటైర్ విసిరారు. నిజంగా ఆయన కోసం పని చేసిన వాళ్ళు ఈయనకు ఏమీకారన్నారు. ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీకారని చెప్పుకొచ్చారు. వైఎస్సార్‌ కోసం పని చేసి గొడ్డలి పోటుకు గురైన వాళ్ళు ఏమి కారని తెలిపారు. వైఎస్సార్సీపీ పార్టీ పేరులో వైఎస్సార్ లేరన్నారు. ‘‘Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయి రెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి’’ అంటూ వైసీపీకి కొత్త అర్ధం చెప్పారు ఏపీసీసీ చీఫ్.


రేపల్లెలో అభివృద్ధి జరిగిందా?

‘‘10 ఏళ్లలో రేపల్లె లో అభివృద్ధి జరిగిందా? ఏ వర్గానికి అయినా న్యాయం జరిగిందా ? జగన్ గారు ఇక్కడకు వచ్చారట. హామీలు ఇచ్చారట. చెక్ డ్యాంలు కట్టి లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారట. 100 పడకల ఆసుపత్రి అన్నారట. అక్వా రైతుల కోసం ఆక్వా పార్క్ అన్నాడు. ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామని చెప్పారట. షిప్పింగ్ హార్బర్ కడతాం అన్నాడు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు’’ అంటూ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి...

TS Elections: రూ.300 కోట్ల ఆస్తి ఉన్నా.. రంజిత్‌రెడ్డికి కారు లేదు!

AP Elections: షాకింగ్.. వలంటీర్లు రాజీనామా చేయలేదని రంగంలోకి ఐప్యాక్.. బెదిరింపులు ఏ రేంజ్‌లో ఉన్నాయో చూడండి!

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 24 , 2024 | 03:47 PM