Share News

AP Elections: తప్పుడు కేసులు పెట్టారనేందుకు నేనే ఉదాహరణ .. పోలీసులపై బోండా ఉమా ఫైర్

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:27 AM

Andhrapradesh: రాష్ట్రంలో ఐదేళ్లు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని టీడీపీ నేత బోండా ఉమా విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులను పోలీసులు వేధించారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, నామినేషన్‌లు వేశాక కూడా పోలీసులు అరాచకాలు ఆగలేదన్నారు.

AP Elections: తప్పుడు కేసులు పెట్టారనేందుకు నేనే ఉదాహరణ .. పోలీసులపై బోండా ఉమా ఫైర్
TDP Leader Bonda Uma

విజయవాడ, ఏప్రిల్ 24: రాష్ట్రంలో ఐదేళ్లు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని టీడీపీ నేత బోండా ఉమా (TDP Leader Bonda Uma) విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు (TDP Chief Chandrababu), పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) వంటి నాయకులను పోలీసులు వేధించారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, నామినేషన్‌లు వేశాక కూడా పోలీసులు అరాచకాలు ఆగలేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితో కొంతమంది పోలీసులు టీడీపీ అభ్యర్థులపై అనేక కేసులు పెట్టారన్నారు. తప్పుడు కేసులు పెట్టారనేందుకు తానే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో చెక్ చేసుకోండి


సీఎం పరిధిలో పోలీసులు లేరనే విషయం కూడా తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు పని‌చేయాలన్నారు. సజ్జల, మరో గొట్టంగాడు చెప్పాడని తమపై అక్రమ కేసులా అంటూ విరుచుకుపడ్డారు. నిన్న ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందన్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల నియమావళి వర్తిస్తుందని తెలిపారు. వైసీపీ కండువా కప్పుకుని పని‌చేసే పోలీసులపై ఫిర్యాదు చేస్తామని.. చట్టానికి, నిబంధనలకు‌ విరుద్ధంగా పని చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నార్త్ ఏసీపీ డి.యన్.ఎ ప్రసాద్, సీఐ దుర్గా ప్రసాద్‌లు వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించారు.


వెల్లంపల్లికి ఈ నిబంధనలు వర్తించవా?

‘‘వెల్లంపల్లి పోస్ట్‌లు వేపించారని స్వామి భక్తి చూపుతున్నారు. మమ్మల్ని అన్యాయంగా ఇబ్బందులు పెడుతున్నారు. మా వాళ్లు ఎక్కడైనా కనిపిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. పోటీలో ఉన్న నేను ప్రచారానికి అనుమతి ఇవ్వాలని అర్జీ పెట్టాం. ఏసీపీ, సీఐలు అనుమతి రిజక్ట్ చేస్తున్నట్లు ఆర్‌ఓకి చెప్పారు. నేను స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే వీలు లేకుండా చేశారు. అడిగితే పనికిమాలిన కారణాలు, ఆంక్షలు పెడుతున్నారు. ఏ సమయంలో ఏ వీధిలో ఎవరి ఇంటి ముందు ఉంటారో సమయం చెప్పాలంట. ఎన్నికల ప్రచారంలో చెప్పిన సమయం ప్రకారం ప్రచారం నడుస్తుందా? నా రాజకీయ జీవితం లో ఇటువంటి నిబంధన ఎప్పుడూ చూడలేదయ, వినలేదు. దేశం మొత్తం లో కూడా పోటీ చేసే అభ్యర్థిగా రాత్రి తొమ్మిది వరకు ప్రచారం చేసుకోవచ్చు. నాకు పోలీసు పర్మిషన్ లేదని నా ప్రచారం ఆపడం దుర్మార్గం కాదా? వెల్లంపల్లికి ఈ నిబంధనలు వర్తించవా? సమయం వారికి పట్టదా?. ఇప్పటికే ఈ ఏసీపీ, సీఐలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఈరోజు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి మరోసారి ఆధారాలతో ఫిర్యాదు చేస్తున్నాం’’ అని బోండా ఉమా వెల్లడించారు.

Lok Sabha Elections: రెండో దశ ఎన్నికల ప్రచారానికి నేడే చివరి రోజు..స్టార్ క్యాంపెయినర్లు సిద్ధం


ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలి...

మే ఒకటి నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుందని.. ఇళ్ల వద్దకు ఇవ్వకుండా సచివాలయాలకు పిలిపిస్తున్నారన్నారు. మొన్న నెలలో ముప్పై మంది చనిపోవడానికి వైసీపీ కారణమని ఆరోపించారు. సెర్ఫ్ సీఈవో మురళీధర్ రెడ్టిను ముందు తప్పించాలని డిమాండ్ చేశారు. మండుటెంటలను దృష్టిలో ఉంచుకుని అందరకీ ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలన్నారు. రాజకీయ స్వలాభం కోసం సొంత బాబాయినే‌ చంపించిన చరిత్ర వాళ్లదన్నారు. ఇక సామాన్య ప్రజల ప్రాణాలు వాళ్లకు ఒక లెక్క కాదన్నారు. అధికార దాహంతో ఎంత మందిని అయినా బలి చేస్తారంటూ మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించాలని.. ఇళ్ల వద్దకే అందరకీ పెన్షన్ అందేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోలీసులు, ఇతర శాఖల అధికారులు కూడా నిబంధనల ప్రకారం పని చేయాలని సూచించారు. కాదంటే భవిష్యత్తులో తప్పకుండా ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.


అదో పెద్ద డ్రామా..

‘‘వెల్లంపల్లిపై దాడి ఘటన పెద్ద డ్రామా. ఓటమి ఖాయమనే సింపతీ డ్రామా ఆడుతున్నారు. బోండా ఉమ‌ ప్రజల. మనిషి... ప్రజలతో, ప్రజల్లోనే ‌ఉంటారు. తాత్కాలికంగా నన్ను అడ్డుకోవచ్చు... ప్రజాస్వామ్యం గెలుస్తుంది. జగన్, వెల్లంపల్లి నాటకాలు ప్రజలకు అర్థం అయ్యాయి. కేసీఆర్‌ను నమ్మకే ప్రజలు అక్కడ ఓడగొట్టారు. ఆయన ఇక్కడ జగన్ గెలుస్తాడని ఎలా చెబుతాడు? జూన్ నాలుగు తరువాత ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఉండడు. కేసిఆర్, జగన్ ఇద్దరూ హైదరాబాద్ కూర్చుని ఓదార్చుకోవాలి. ఎల్లవేళలా అబద్దాలతో మాయ చేద్దాం అంటే సాధ్యం కాదు. జగన్ మోసాలు ప్రజలకు అర్థం అయ్యాయి... ‌కూటమి విజయం ఖాయం’’ అంటూ టీడీపీ నేత ధీమా వ్యక్తం చేశారు.

IPL 2024: మార్కస్ స్టోయినిస్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా..


నన్ను ఇరికించాలనుకున్నారు...

జగన్‌పై రాయి దాడి ఘటనలో తనను ఇరికించాలని చూశారని మండిపడ్డారు. కొంతమంది పోలీసులు కూడా అత్యుత్సాహంతో వ్యవహరించారన్నారు. అమాయకులను బెదిరించి తన పేరు‌ చెప్పించాలని‌ చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘానికి ఈ అంశాలపై ఫిర్యాదు చేశామన్నారు. వారు విచారణ చేశాకే పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్నారన్నారు. తనపై ఎటువంటి కేసులు లేవని... తాను ప్రజల మనిషిని అని చెప్పుకొచ్చారు. ప్రజల కోసం చేసే పోరాటాల వల్ల పెట్టిన కేసులే ఉన్నాయన్నారు. రాయి దాడి కేసు, ఆంక్షలతో తన ప్రచారాన్ని అడ్డుకోవాలని కుట్ర చేశారని ఆరోపించారు. వైసీపీ ఓటమి ఖాయం‌ కాబట్టే భయంతో అడ్డంకులు పెడుతున్నారన్నారు. విజయవాడ సెంట్రల్‌తో పాటు, ఏపీ వ్యాప్తంగా కూటమి విజయం ఖాయం అని బోండా ఉమా స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Eyes: వేసవిలో మీ నేత్రాలను ఇలా సంరక్షించుకోండి...

AP Politics: చింతమనేనికి చంద్రబాబు ఫోన్.. ఎందుకోసమంటే..

Read Letest AP News AND Telugu News

Updated Date - Apr 24 , 2024 | 12:11 PM