Home » Bonda Umamaheswara Rao
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై వైసీపీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చిన పేరు, ప్రతిష్ఠలను తట్టుకోలేక వైసీపీ స్వార్థ రాజకీయాలకు తెరతీసిందని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు (MLA Bonda Umamaheswara Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను సాక్షాత్తు విజయసాయి రెడ్డి చెప్పారని అన్నారు.
వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు.
ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన అంశంపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణతో పార్టీ అధిష్ఠానం సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. సమన్వయ లోపం వల్లే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.
‘నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు.. భవిష్యత్తులో కూడా దాటను' అని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. తాను కేవలం ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరయ్యాయని, తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.
రాష్ట్ర, దేశ పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును అట్టహాసంగా కాకుండా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలిపారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్‌లో జేసీబీ వాహనాల ప్రారంభం ఆనందదాయకమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గతంలో ఈ ప్రాంత వాసులు అనేక సమస్యలతో ఇబ్బంది పడేవారన్నారు.
విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో టిడ్కో ఇళ్ల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌పై ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని బోండా ఉమ సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ గుర్తు ఉందని, తప్పకుండా అమలు చేసి తీరుతామని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. రూ. 240 కోట్లతో సెంట్రల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని బోండా ఉమ పేర్కొన్నారు.