Share News

‘ఇష్టం వచ్చినట్లు వాగితే చూస్తూ ఊరుకోం’.. వైసీపీ నేతలకు బోండా ఉమ స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Aug 08 , 2026 | 02:26 PM

వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు.

‘ఇష్టం వచ్చినట్లు వాగితే చూస్తూ ఊరుకోం’.. వైసీపీ నేతలకు బోండా ఉమ స్ట్రాంగ్ వార్నింగ్
Bonda uma

విజయవాడ, ఆగస్టు 8: వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. నిరసనల పేరుతో రోడ్డెక్కి బూతులు తిడతారా అంటూ మండిపడ్డారు. ‘విమర్శలు హుందాగా చేయాలని.. కాదని వాగితే ఇళ్లకు వచ్చి కొడతాం’ అంటూ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డీఎస్సీపై చర్చకు సిద్ధమని సవాల్ చేస్తే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రోడ్లపైకి వచ్చి తిడుతుంటే చూస్తో ఊరుకోమని.. రప్పా.. రప్పా అంటే వదిలేయాలా అని అన్నారు.


‘కాళ్లు పట్టుకున్నా ఊరుకోం అంటారా.. మేము అనుకుంటే మీ‌ బతుకు ఎంత. నేను రౌడీయిజం చేస్తే మీరు రోడ్లపై తిరగగలరా. అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో నా నియోజకవర్గం టాప్ 8లో ఉంది. హద్దు మీరి మాట్లాడితే ఇక నుంచి ఇలాగే సమాధానం చెబుతాం’ అని టీడీపీ నేత అన్నారు. నోరు పారేసుకుంటే మాత్రం ఎక్కడికైనా వస్తాం.. సంగతి తేలుస్తామని వైసీపీ నేత పేర్నినానిని ఉద్దేశించి హెచ్చరించారు. పద్ధతి తప్పినప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను తిడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ‘నాకు టిక్కెట్ రాదని చెప్పడానికి మీరెవరు. మా అధినేత చంద్రబాబు అనుకుంటే నాకు సీటు ఇస్తారు. మీ సంగతి మీరు చూసుకోండి.. మీకే అక్కడ దిక్కు లేదు’ అంటూ బొండా ఉమ విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

వివేకా హత్య కేసు విచారణలో అవకతవకలు: వైఎస్ సునీతా రెడ్డి

‘థాంక్యూ సీఎం సర్.. థాంక్యూ లోకేశ్ సర్’.. కొండారెడ్డి బురుజు వద్ద టీచర్స్ నినాదాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 02:55 PM