పోక్సో కేసులో పృథ్వీశ్వర్‌కు షాక్.. తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ నుంచి సస్పెన్షన్
ABN , Publish Date - Aug 08 , 2026 | 01:04 PM
తెలంగాణ బాస్కెట్ బాల్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లైంగిక ఆరోపణల కేసులో పృథ్వీశ్వర్‌ను తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, ఆగస్టు 8: తెలంగాణ బాస్కెట్ బాల్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లైంగిక ఆరోపణల కేసులో పృథ్వీశ్వర్‌ను తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్(టీబీఏ) సస్పెండ్ చేసింది. టీబీఏ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పృథ్వీశ్వర్‌పై చర్యలు తీసుకున్నట్లు బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు(బీఎఫ్‌ఐ) అసోసియేషన్ లేఖ పంపించింది. అలాగే, జాయింట్ సెక్రటరీగా ఉన్న విష్ణు కుమార్ గౌడ్‌ను జనరల్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు టీబీఏ ప్రకటించింది.
పోక్సో కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడం లేదని డీజీపీ, సీపీకి బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. పృథ్వీశ్వర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాస్కెట్ బాల్‌లో ఎంతో భవిష్యత్తు ఉన్న క్రీడాకారిణిపై వేధింపులు జరగడంతో బాలిక తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతోందని డీజీపీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు టీబీఏలో నిందితుడు పృథ్వీశ్వర్ భారీగా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణల నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విచారణ జరుపుతోంది.
ఇవి కూడా చదవండి...
మృత్యువుతో పోరాడుతున్న ప్రియాంక.. నేడు కీలక పరీక్ష చేయనున్న వైద్యులు
హైడ్రాలో ఉద్యోగాల కోసం వస్తే అవమానిస్తారా.. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిందే: హరీశ్ రావు
Read Latest Telangana News And Telugu News