మృత్యువుతో పోరాడుతున్న ప్రియాంక.. నేడు కీలక పరీక్ష చేయనున్న వైద్యులు
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:01 PM
రాజమండ్రి మెడికో విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై వైద్యులు ఆమెకు చికిత్స అందజేస్తున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 8: రాజమండ్రి మెడికో విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై వైద్యులు ఆమెకు చికిత్స అందజేస్తున్నారు. ఇటీవల రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్యామాల్‌లో స్కూటీపై వెళ్తున్న మెడికోలు డాక్టర్ ప్రియాంక, దుర్గవెంకటసాయిలను మద్యం సేవించిన కొందరు యువకులు కారుతో బలంగా ఢీకొట్టారు. ఈ నేపథ్యంలో ప్రియాంక తలపై నుంచి కారు వెళ్లడంతో బ్రెయిన్ డెడ్‌కు గురైంది. దీంతో విద్యార్థినిని హుటాహుటిన రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు తరలించగా.. కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. గడిచిన ఆరో రోజులుగా ప్రియాంక మృత్యువుతో పోరాడుతోంది.
మెడికో ప్రియాంక చికిత్సలో చివరి ప్రయత్నంగా నేడు ఆప్నియా పరీక్ష చేయనున్నారు వైద్యులు. కోమాలో ఉన్న ప్రియాంక మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయిందా.. లేదా అని నిర్ధారించడానికి డాక్టర్లు కీలకమైన పరీక్ష చేయనున్నారు. ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయిందా.. లేదా అనేది అప్నియా పరీక్షతో తెలుసుకోనున్నారు. ఆప్నియా పరీక్ష అనంతరం చివరి రిజల్ట్‌ను విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేయనున్నారు. అంతేకాకుండా, ప్రియాంక ఆర్గాన్ డొనేషన్ చేసే విషయంపై తల్లిదండ్రులకు ఇప్పటికే పలు మార్లు కిమ్స్ వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మెడికో చనిపోయిందని నిర్ధారిస్తే ఆర్గాన్స్ డొనేట్ చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలనే ఆలోచనలో ప్రియాంక కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
డూప్లెక్స్ ఇంట్లో బయటపడ్డ మహిళ అస్థిపంజరం..
హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాలు.. పోటెత్తిన నిరుద్యోగులు.. తోపులాట
Read Latest Telangana News And Telugu News