డూప్లెక్స్ ఇంట్లో బయటపడ్డ మహిళ అస్థిపంజరం..
ABN , Publish Date - Aug 08 , 2026 | 07:37 AM
ఓ డూప్లెక్స్ ఇంట్లో మహిళ అస్థిపంజరం వెలుగుచూసిన సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మహిళ మరణించిన ఏడాది తర్వాత ఆమె అస్థిపంజరం వెలుగులోకి రావటం కలకలం రేపుతోంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఓ డూప్లెక్స్ ఇంట్లో మహిళ అస్థిపంజరం వెలుగుచూసిన సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరులోని బాగలగుంటే ఏరియాకు చెందిన 52 ఏళ్ల దాక్షాయణి హవనూర్ లేఅవుట్‌లోని డూప్లెక్స్ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమె భర్త ఉమేష్ 10 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్‌లో చనిపోయాడు. కుమారుడు క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయాడు. దాక్షాయణికి ఓ కూతురు ఉంది. ఆమెకు చాలా కాలం క్రితమే పెళ్లైంది. ఒంటరిగా ఉంటున్న దాక్షాయణి సంవత్సరం క్రితం చనిపోయింది.
ఈ ఏడాది కాలంలో కూతురు, అల్లుడు ఆ ఇంటికి రాకపోవటంతో దాక్షాయణి చనిపోయిన సంగతి బయటపడలేదు. నిన్న (శుక్రవారం) సమాచారం అందుకున్న బాగలగుంటే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్థిపంజరాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ మరణానికి గల కచ్చితమైన కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రైలెక్కిన జవాన్.. ఆ తర్వాత అదృశ్యం
రూ.3 కోట్లు ఇవ్వకుంటే కుటుంబాన్ని చంపేస్తాం! పెళ్లి రద్దుతో అబ్బాయికి బెదిరింపులు