మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. 9న దుకాణాలు బంద్
ABN , Publish Date - Aug 08 , 2026 | 09:20 AM
బోనాల పండుగ సందర్భంగా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
బోనాల సందర్భంగా వైన్ షాపులు క్లోజ్
హైదరాబాద్ సిటీ: బోనాల పండుగ సందర్భంగా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సైబరాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్‌తోపాటు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఈనెల 9న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు,
రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న వైన్‌షాపులు తాత్కాలికంగా మూసివేయాలని ట్రై కమిషనరేట్ల కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్‌లలో ఆగస్టు 9, 10 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని నగర సీపీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పరుగు ఆపని పసిడి.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News