Home » Bonalu Festival
నాల వేడుకల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 20, 21వ తేదీల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
బోనాల జాతరను సాకలు పోసి బాగా చేసినా.. ప్రతిసారి చేసినట్లే ఈసారి కూడా పొరపాటు చేశారని రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత మండిపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఆదివారం బోనాల శోభతో కళకళలాడాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో లష్కర్ బోనాల జాతర ఆదివారం ప్రారంభమయ్యాయి.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి కీర్తనలతో గుడి పరిసరాలు హోరెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు.
ఉజ్జయినీ మహాకాళి బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌కు 175 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ శుక్రవారం వెల్లడించారు. 13, 14తేదీల్లో జరిగే బోనాలకు నగరం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరిలివచ్చే అవకాశాలున్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా స్పెషల్ సర్వీసులు నడిపేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందన్నారు.
ఉజ్జయినీ మహాకాళి బోనాల పండుగ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు(Liquor shops) బంద్ చేస్తున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(City Police Commissioner CV Anand) ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 13, 14వ తేదీల్లో జరిగే బోనాల జాతరకు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి ఆలయంతో పాటు లష్కర్‌లోని అమ్మవారి ఆలయాలను సిద్ధం చేస్తున్నారు.
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం తాత్కాలికంగా షాక్ ఇచ్చింది. వైన్ షాపులు మూసివేస్తున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి నగర సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాతే వాటి విశిష్టత మరింత పెరిగిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్(Sanathnagar MLA Talasani Srinivas Yadav) అన్నారు.
Bonalu Festival 2025: భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక, ఎల్లమ్మ ఆలయంలో తొలి బోనంతో బోనాలు మొదలయ్యాయి.