‘దృక్ సిద్ధాంత పంచాంగం’ అభినందనీయం
ABN , Publish Date - Aug 08 , 2026 | 07:52 AM
రాష్ట్రంలోని 16 వేల ఆలయాల్లో అమలు పరిచేందుకు దృక్ సిద్ధాంత పంచాంగం రూపొందించడం అభినందనీయమని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశంసించారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్: రాష్ట్రంలోని 16 వేల ఆలయాల్లో అమలు పరిచేందుకు దృక్ సిద్ధాంత పంచాంగం రూపొందించడం అభినందనీయమని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశంసించారు. గురువారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పంచాంగ సిద్ధాంతకర్తల సమావేశంలో తీసుకు న్న నిర్ణయాలను దృక్ సిద్ధాంత పంచాంగ కర్తల సమాఖ్య ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ పండితు లు ఇచ్చిన నివేదికను దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్, పౌర సంబంధాల శాఖ మంత్రులు, అధికారులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
గ్రామస్థాయిలో పురోహితులకు, అన్ని కులాల అర్చకులకు ప్రభుత్వం తరపున పండుగలకు సంబంధించి ముందస్తుగా సమాచారం అందిస్తామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ, దృక్ సిద్ధాంత పంచాంగ కర్తల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అవసరాల ప్రసాద్ శర్మ సిద్ధాంతి, పురోహితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర నాగేంద్ర శర్మ, పెరంబదూర్ శ్రీకాంత్ స్వామి తదితరులున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మూసీ ప్రాజెక్టుకు లైన్‌క్లియర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News