శ్రీశైలం రిజర్వాయర్‌కు కొనసాగుతున్న వరద
ABN , Publish Date - Aug 08 , 2026 | 07:19 AM
కృష్ణమ్మ ఎగువ నుంచి పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. భారీ వరద కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,57,059 క్యూసెక్కులు ప్రవహిస్తోంది.
నిండేందుకు 10 అడుగుల దూరంలో
ప్రస్తుత నిల్వ 162.81 టీఎంసీలు
మూడ్రోజుల్లో 200 టీఎంసీలకు చేరే చాన్స్
కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి
నాగార్జున సాగర్‌కు 30,792 క్యూసెక్కులు
ప్రస్తుత నిల్వ 162.81 టీఎంసీలు
మరో మూడ్రోజుల్లో 200 టీఎంసీలకు చేరే చాన్స్
అమరావతి/శ్రీశైలం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): కృష్ణమ్మ ఎగువ నుంచి పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. భారీ వరద కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,57,059 క్యూసెక్కులు ప్రవహిస్తోంది. 2,11,331 క్యూసెక్కులు శ్రీశైలం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 874.70 అడుగులు ఉంది. పూరిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను 162.8190 టీఎంసీల నిల్వలున్నాయి.
మరో మూడ్రోజుల్లో 200 టీఎంసీలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. రెండ్రోజుల పాటు 2 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద కొనసాగుతుందని చెబుతున్నారు. కాగా.. వెలిగోడుకు 4000 క్యూసెక్కులను విడుదల చేయగా.. శనివారం గోరకల్లుకు కూడా 4000 క్యూసెక్కుల తరలించనున్నారు. కుడి, ఎడమల రెండు రాష్ట్రాల జలవిద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఎడమ గట్టు తెలంగాణ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 21,189 క్యూసెక్కులతో 7.319 మిలియన్ యూని ట్లు, కుడిగట్టు కేంద్రంలో 9,603 క్యూసెక్కులతో 1.684 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. దిగువన నాగార్జునసాగర్‌కు 30,792 క్యూసెక్కులు విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి
మూసీ ప్రాజెక్టుకు లైన్‌క్లియర్