పాత పెన్షన్ విధానంపై సుప్రీంకు తెలంగాణ ప్రభుత్వం
ABN , Publish Date - Aug 08 , 2026 | 07:36 AM
తెలంగాణలో 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) వర్తింపజేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
41 మంది ప్రతివాదులకు కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: తెలంగాణలో 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) వర్తింపజేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉమ్మడి ఏపీలో 2004కన్నా ముందు నోటిఫికేషన్లు వచ్చి, ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ ఇవ్వాలని గతంలో కోర్టులు తీర్పు చెప్పాయి. అదే తరహాలో తమ వినతులనూ పరిశీలించాలని కోరుతూ కొందరు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించగా వారి వినతులను పరిశీలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఆ ఆదేశాలను అమలు చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడంతో ఆ ఉద్యోగులు కోర్టు ధిక్కరణ కేసులు వేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.నరసింహారెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం స్పంది స్తూ.. 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
మూసీ ప్రాజెక్టుకు లైన్‌క్లియర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News