Share News

ఉన్నత విద్య కనీస ఫీజులు ఖరారు

ABN , Publish Date - Aug 08 , 2026 | 07:24 AM

ఏపీలో ఉన్నత విద్య కనీస ఫీజులను నిర్ణయిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఉన్నత విద్య కనీస ఫీజులు ఖరారు
AP College Fees 2026

అమరావతి, (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య కనీస ఫీజులను నిర్ణయిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. డిగ్రీలో... బీఎస్సీకి రూ.17,500, బీకాం రూ.14 వేలు, బీఏ రూ.13 వేలు, బీ ఒకేషనల్‌ రూ.17,500, బీబీఏ/బీబీఎం రూ.21 వేలు, బీసీఏ రూ.21 వేలు, బీహెచ్‌ఎంకు రూ.35 వేలు కనీస ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది.


న్యాయ కోర్సుల్లో ఎల్‌ఎల్‌బీ (మూడేళ్లు) రూ.16 వేలు, ఎల్‌ఎల్‌బీ (ఐదేళ్లు) రూ.15 వేలు, ఎంఎల్‌/ఎల్‌ఎల్‌ఎం రూ.22 వేలుగా నిర్ణయించింది. ఫార్మా కోర్సుల్లో బీ-ఫార్మసీ రూ.45 వేలు, ఫార్మా-డీ రూ.45 వేలుగా నిర్ణయించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

మహిళా ట్రైనీ ఐపీఎస్ కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్న ఉమెన్ సేఫ్టీ అధికారులు

హైదరాబాద్‌లో భారీగా ఓట్ల కోత!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 07:24 AM