Share News

గ్రూప్‌-1లో డీఈవో పోస్టులు

ABN , Publish Date - Aug 08 , 2026 | 07:13 AM

కొత్తగా సృష్టించే జిల్లా విద్యా శాఖాధికారి(డీఈవో) పోస్టులను గ్రూప్‌-1 ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు విద్యా సర్వీస్‌ రూల్స్‌-1998కు సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది

గ్రూప్‌-1లో డీఈవో పోస్టులు
APPSC Group 1

అమరావతి, (ఆంధ్రజ్యోతి): కొత్తగా సృష్టించే జిల్లా విద్యా శాఖాధికారి(డీఈవో) పోస్టులను గ్రూప్‌-1 ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు విద్యా సర్వీస్‌ రూల్స్‌-1998కు సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం ఇక నుంచి డీఈవో పోస్టుల్లో 50శాతం గ్రూప్‌-1 ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 50 శాతం పోస్టులను పదోన్నతి ద్వారా ఇస్తారు. ప్రస్తుతం డీఈవో/డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టులు 18 ఖాళీ ఉన్నట్టు గుర్తించారు. వాటిని భర్తీ చేసేందుకు షెడ్యూల్‌ విడుదల చేశారు. డీఈవోలను డీఆర్‌(నేరుగా నియామకం) ద్వారా, డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టులను పదోన్నతి ద్వారా నియమించనున్నారు.


అదేవిధంగా పదోన్నతి ద్వారా 9 రకాల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా భర్తీ చేసే డీఈవో పోస్టుల కోసం అభ్యర్థులు డిగ్రీ చేసి ఉండాలని పేర్కొన్నారు. అది కూడా బీఈడీ ప్రవేశానికి అర్హత సాధించే సబ్జెక్టులతో డిగ్రీ ఉండాలని, పీజీ చేసిన వారు కూడా అర్హులేనని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

ఐఏఎస్ సందీప్ కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

రెండో రోజుకు ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ.. ఐఫోన్‌పై లోతుగా దర్యాప్తు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 07:24 AM