Share News

ఐఏఎస్ సందీప్ కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:33 AM

కోర్ట్ ధిక్కరణ వ్యవహారంలో తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా హైకోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. సందీప్ సుల్తానియా కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఐఏఎస్ సందీప్ కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Telangana High Court

హైదరాబాద్, ఆగస్టు 7: కోర్ట్ ధిక్కరణ వ్యవహారంలో తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా హైకోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. సందీప్ సుల్తానియా కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సందీప్ సుల్తానియాపై వెయ్యి కేసులు ఉన్నాయని.. అవన్నీ విచారణ చేస్తే జీవిత కాలం జైల్లో ఉండాలని పేర్కొంది. ప్రభుత్వాలు చేసిన తప్పుకు అధికారులకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అధికారులను హైకోర్టుకు పిలిపించడం బాధగా ఉందని.. తప్పని పరిస్థితుల్లో హాజరుకావాలని ఆదేశిస్తున్నామని న్యాయస్థానం తెలిపింది. ఉచిత పథకాల వల్ల చాలా ప్రమాదం ఉందని.. రైతుబంధు అనేది సంపన్నులు, అధికారులు కూడా తీసుకుంటున్నారని.. ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. రైతుబంధుతో రాష్ట్ర ఖజానాకు భారమని హైకోర్టు వ్యాఖ్యానించింది.


కోర్టు ధిక్కరణ కేసులో నిన్న(గురువారం) హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ బోర్డుకు బకాయిల విడుదలపై కోర్టు ఉత్తర్వులు ధిక్కరించడంతో హైకోర్టు సీరియస్ అయ్యింది. సందీప్ సుల్తానియా ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్టు చేసి హాజరుపరచాలని నిన్న హైదరాబాద్ సీపీని హైకోర్టు ఆదేశించింది. ఈరోజు(శుక్రవారం) కచ్చితంగా హైకోర్టు ముందు హాజరవుతానని తెలపడంతో సుల్తానియాకు బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతోపాటు రూ.5000 పూచికత్తుతో బెయిల్‌పై హైదరాబాద్ సీపీ విడుదల చేశారు. సందీప్ సుల్తానియా బెయిల్‌పై విడుదల వివరాలను హైదరాబాద్ పోలీసులు.. కోర్టుకు సమర్పించారు. 2024లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సందీప్ సుల్తానియా ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదనంటూ రామకృష్ణ అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న కీలక ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి...

ట్రంప్ కొత్త ఆదేశాలు.. జన్మతః పౌరసత్వ నిబంధనలు మరింత కఠినతరం

రాష్ట్ర పండుగగా పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి.. మంత్రి సవిత ఘన నివాళి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 07 , 2026 | 11:40 AM