Share News

కర్నూలులో టీడీపీ కార్యకర్త దారుణ హత్య

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:00 AM

కర్నూలులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంతియాజ్ (37) దారుణ హత్యకు గురయ్యాడు. నగదు విషయంలో అతడితో ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఈ సందర్భంగా ఇంతియాజ్‌పై వారు రాళ్లతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇంతియాజ్.. అక్కడికక్కడే మరణించారు.

కర్నూలులో టీడీపీ కార్యకర్త దారుణ హత్య

కర్నూలు, ఆగస్టు 07: నగరంలోని మాసుంబాషా దర్గా సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంతియాజ్ (37) దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం అర్థరాత్రి నగదు విషయంలో అతడితో ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు.ఈ సందర్భంగా ఇంతియాజ్‌పై వారు రాళ్లతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇంతియాజ్.. అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై ఇంతియాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి.. వారిని పోలీసులు విచారిస్తున్నారు.


ఇంతియాజ్‌‌కు, మరో ఇద్దరు వ్యక్తుల మధ్య నగదు విషయంలో వివాదం తలెత్తింది. ఆ కారణంతోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇంతియాజ్‌పై దాడి చేసిన వారిలో ఒకరిపై గతంలో జరిగిన ఓ హత్య కేసుతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి హత్య కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ హత్యకు దారితీసిన కారణాలు, ఈ ఘటనలో మరెవరి ప్రమేయం అయినా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరో వైపు ఇంతియాజ్ మృతితో ఆ ఇంట విషాదం నెలకొంది. అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.


ఇవి కూడా చదవండి...

రాష్ట్ర పండుగగా పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి.. మంత్రి సవిత ఘన నివాళి

జాతీయ చేనేత దినోత్సవం.. నేతన్నలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 07 , 2026 | 11:36 AM