గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం
ABN , Publish Date - Aug 08 , 2026 | 09:01 AM
గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సర్వీస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి నియోపోలీస్ బ్రిడ్జ్ పిల్లర్‌ను తవేరా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
హైదరాబాద్, ఆగస్టు 08: గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సర్వీస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి నియోపోలీస్ బ్రిడ్జ్ పిల్లర్‌ను తవేరా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు రాజస్థాన్‌కు చెందిన కనైయాలాల్ (25), దేరామ్ (24)గా గుర్తించామని తెలిపారు. వీరిద్దరు టైల్స్ కార్మికులుగా పని చేస్తున్నారని చెప్పారు. ఇంద్రారెడ్డి నగర్ నుంచి నానక్‌రామ్‌గూడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన కారు నంబర్ AP01AB2232 అని పోలీసులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైలెక్కిన జవాన్.. ఆ తర్వాత అదృశ్యం
మగ్గం తొక్కి.. పిల్లాడిని ముద్దాడి.. చేనేత కుటుంబాలతో సరదాగా!
For More TG News And Telugu News