Share News

మగ్గం తొక్కి.. పిల్లాడిని ముద్దాడి.. చేనేత కుటుంబాలతో సరదాగా!

ABN , Publish Date - Aug 08 , 2026 | 07:07 AM

చేనేత కేవలం ఒక వృత్తి కాదని భారతీయ సంస్కృతికి ప్రతీక అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఇది దేశం గర్వించే కళ అని చెప్పారు. మన రాష్ట్రం చేనేత కళలకు నిలయమని ఆయన గుర్తు చేశారు.

మగ్గం తొక్కి.. పిల్లాడిని ముద్దాడి.. చేనేత కుటుంబాలతో సరదాగా!

బాపట్ల: మగ్గాలను ఆధునీకరిస్తే ఎంత ఖర్చవుతుంది. నెలవారీ ఎంత ఆదాయం వస్తుంది. పిల్లలు ఏం చదువుతున్నారు. ఉచిత విద్యుత్‌ అందించడం వల్ల మేలు జరుగుతుందా? అని చేనేత కార్మికులను సీఎం చంద్రబాబు ఆరాతీశారు. పిల్లాడిని ఎత్తుకుని ముద్దు చేశారు. స్వయంగా మగ్గం తొక్కారు. కుప్పడం పట్టు చీరను కొనుగోలు చేశారు. జాండ్రపేట గ్రామంలో బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నడిచే చేనేత యూనిట్‌ను ఆయన సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో కలిసి కష్టసుఖాలను విచారించారు.


యూనిట్‌ నిర్వహణకు అయ్యే ఖర్చును తెలుసుకున్నారు. ఆధునీకరిస్తే ఎంత ఖర్చవుతుందనే విషయంతో పాటు చీరల మార్కెటింగ్‌ వివరాలను యూనిట్‌ యజమాని సుబ్రహ్మణ్యంను అడిగి తెలుసుకున్నారు. అక్కడ వర్క్‌షాప్‌లో కార్మికులతో సీఎం ముచ్చటించారు. బొడ్డు అరుణ అనే మహిళ మగ్గంపై చీర నేస్తున్న తీరును ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు.


ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తమ జీవనోపాధికి కొంత భరోసా లభించిందని సీఎంతో కార్మికులు చెప్పారు. మరింతగా జీవనప్రమాణాలు పెంచడానికి ఏం చేయాలో.. అవన్నీ చేస్తానని వారికి సీఎం హామీ ఇచ్చారు. చేనేత కార్మికుడు వీరబాబు ఇంటిలోకి వెళ్లిన సీఎం కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుప్పడం పట్టుకు కేంద్ర అవార్డు దక్కడం గర్వ కారణమని సీఎం పేర్కొన్నారు.


చేనేత.. దేశం గర్వించే కళ: సీఎం చంద్రబాబు

చేనేత కేవలం ఒక వృత్తి కాదని భారతీయ సంస్కృతికి ప్రతీక అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఇది దేశం గర్వించే కళ అని చెప్పారు. మన రాష్ట్రం చేనేత కళలకు నిలయమని గుర్తు చేశారు. నేతన్నలకు ఆసరాగా ఉండడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. మంగళగిరిలో హ్యాండ్లూమ్‌ పార్కును తెస్తున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ను నెలకొల్పుతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైలెక్కిన జవాన్‌.. ఆ తర్వాత అదృశ్యం

పుష్పవతి కలనెరవేరింది..90 ఏళ్ల వృద్ధురాలితో ఫొటో దిగిన సీఎం

For More AP News And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 07:44 AM