మహిళా ఎస్‌ఐపై అసభ్య ప్రవర్తన.. వైసీపీ నేత కోసం పోలీసుల గాలింపు
ABN , Publish Date - Aug 08 , 2026 | 10:22 AM
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రవి కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు.
శ్రీకాకుళం, ఆగస్టు 8: జిల్లాలోని ఆమదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రవి కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. మహిళా ఎస్‌ఐపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో రవికుమార్ పరారీలో ఉన్నారు. ఇటీవల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆముదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జి చింతాడ రవి.. మహిళా ఎస్‌ఐపై అనుచితంగా ప్రవర్తించారంటూ ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వైసీపీ నేత సహా 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో రవి ఏ1గా ఉన్నారు. జగన్ పర్యటన అనంతరం గత పది రోజులుగా అరెస్ట్ భయంతో వైసీపీ నేతతోపాటు అనుచరులంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. రవిని అరెస్ట్ చేసేందుకు విస్తృతంగా గాలిస్తున్నారు. నిన్నటి నుంచి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి వైసీపీ నేత ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 21 మందిలో నిన్న రాత్రి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా ఎస్‌ఐపై అనుచితంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశారనే ఉద్దేశంతో రవితో పాటు 21 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో వైసీపీ నేతను ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
డూప్లెక్స్ ఇంట్లో బయటపడ్డ మహిళ అస్థిపంజరం..
వైసీపీ నేతలకు కోట్ల విలువైన భూముల అప్పగింత.. డిప్యూటీ కలెక్టర్‌పై కేసు
Read Latest AP News And Telugu News