Share News

వైసీపీ నేతలకు కోట్లు విలువైన భూముల అప్పగింత.. డిప్యూటీ కలెక్టర్‌పై కేసు

ABN , Publish Date - Aug 08 , 2026 | 09:37 AM

కోట్లు విలువ చేసే భూములను వైసీపీ నేతలకు కట్టబెట్టిన కేసులో జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ మహేశ్వర్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో సీకే దిన్నె తహశీల్దార్‌గా మహేశ్వర్ రెడ్డి పనిచేశారు.

వైసీపీ నేతలకు కోట్లు విలువైన భూముల అప్పగింత.. డిప్యూటీ కలెక్టర్‌పై కేసు
Kadapa Deputy Collector case

కడప, ఆగస్టు 8: కోట్లు విలువ చేసే భూములను వైసీపీ నేతలకు కట్టబెట్టిన కేసులో జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ మహేశ్వర్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ కలెక్టర్‌తోపాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది. నిందితుల్లో వీఆర్వో, సబ్‌రిజిస్ట్రార్‌లు కూడా ఉన్నారు. కడప నగర శివారులో సుమారు రూ.12 కోట్ల విలువైన భూమిని నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా వేరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేసిన ఘటనకు సంబంధించి ఈ కేసు నమోదైంది.


గత జగన్ ప్రభుత్వ హయాంలో మహేశ్వర్ రెడ్డి సీకే దిన్నె తహశీల్దార్‌గా పనిచేశారు. ఆ సమయంలో వైసీపీ నేతలతో చేతులు కలిపి కోట్లాది రూపాయల విలువైన భూములను వారికి అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి. కడప నగర శివారులోని రూ.12 కోట్ల విలువైన భూమికి సంబంధించిన రికార్డులు, సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులు నకిలీ పత్రాల వ్యవహారాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. భూమిని వేరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్ రెడ్డితో పాటు వీఆర్వో, సబ్‌రిజిస్ట్రార్ సహా మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డి డిప్యూటీ కలెక్టర్ హోదాలో నెల్లూరులో పనిచేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి...

రష్యా చమురు కొంటే సుంకాలు.. బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం

డూప్లెక్స్ ఇంట్లో బయటపడ్డ మహిళ అస్థిపంజరం..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 10:57 AM