భార్య కోసం అధికార దుర్వినియోగం.. అప్పటి అధికారిపై అభియోగాలు
ABN , Publish Date - Aug 08 , 2026 | 08:12 AM
వయోజన విద్య జాయింట్ డైరెక్టర్, గత ప్రభుత్వంలో ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా పనిచేసిన బి. ప్రతాప్‌రెడ్డిపై పాఠశాల విద్యాశాఖ పలు అభియోగాలు నమోదు చేసింది. ఆయన భార్య, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్పలత కోసం మండలి ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని స్పష్టం చేసింది.
అమరావతి: వయోజన విద్య జాయింట్ డైరెక్టర్, గత ప్రభుత్వంలో ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా పనిచేసిన బి. ప్రతాప్‌రెడ్డిపై పాఠశాల విద్యాశాఖ పలు అభియోగాలు నమోదు చేసింది. ఆయన భార్య, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్పలత కోసం మండలి ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
2021లో గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ప్రతాప్‌రెడ్డి ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు ముందు 2021లో ఫిబ్రవరి 16 నుంచి మార్చి 14 వరకు ఆయన సెలవులో ఉన్నారు. ఆ సమయంలో తన అధికారాన్ని తన సతీమణి ఎన్నికల కోసం ఉపయోగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
సెలవు సమయంలో విజయవాడ రూరల్ ఎంఈవో ఎ. వెంకటరత్నం ద్వారా నులకపేటలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు సమావేశానికి హాజరు కావాలని రెండు జిల్లాల ఎంఈవోలకు ఆయన వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పెట్టించారు. ఇది సర్వీస్ రూల్స్‌కు విరుద్ధం. అలాగే టీచర్లు, ఇతరుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కూడా అభియోగాలు నమోదు చేశారు. తన భార్య కోసం ఆయన పాఠశాలలను సందర్శించి ఎన్నికల ప్రచారం చేశారని ప్రాథమిక విచారణలో ఉన్నతాధికారులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైలెక్కిన జవాన్.. ఆ తర్వాత అదృశ్యం
మగ్గం తొక్కి.. పిల్లాడిని ముద్దాడి.. చేనేత కుటుంబాలతో సరదాగా!
For More AP News And Telugu News