Share News

ఈసారి 'మహిళా శక్తి' థీమ్‌తో మహానాడు.. రికార్డ్ క్రియేట్ చేయబోతున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమ

ABN , Publish Date - May 26 , 2026 | 01:04 PM

రాష్ట్ర, దేశ పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును అట్టహాసంగా కాకుండా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలిపారు.

ఈసారి 'మహిళా శక్తి' థీమ్‌తో మహానాడు.. రికార్డ్ క్రియేట్ చేయబోతున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమ
Bonda Uma

అమరావతి, మే 26: రాష్ట్ర, దేశ పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును అట్టహాసంగా కాకుండా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలిపారు. జూమ్ యాప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1870 క్లస్టర్లలో ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించడం ఒక రికార్డుగా నిలవబోతోందని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘గత 23-24 నెలల పరిపాలనలో యువత కోసం మెగా డీఎస్సీ ద్వారా 17,000 నుంచి 18,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం’..


‘గ్రూప్ 4, ఎస్ఐ, 5 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాము. చదువు మధ్యలో ఆపేసిన వారికి.. స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇచ్చి బ్యాంకు సపోర్టుతో రుణాలు అందిస్తున్నాము. ఈసారి మహానాడు 'మహిళా శక్తి' థీమ్ మీద జరుగబోతోంది. దీని ముఖ్య ఉద్దేశం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే. డ్వాక్రా మహిళలకు ఎటువంటి హామీ లేకుండా 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాము. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నాము’..


‘ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నాము. డ్రగ్స్ వాడకాన్ని వెంటనే గుర్తించేలా పోలీసులకు 'స్పాట్ అనాలసిస్' కిట్లను అందించాము. ఈసారి మహానాడులో రైతులకు, బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి ప్రత్యేక తీర్మానాలు చేయబోతున్నాము’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి

ఆర్సీబీని కలవరపెడుతోన్న కోహ్లీ ప్లే ఆఫ్స్ రికార్డు

మజ్లిస్ ఒత్తిడితో జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేశారు.. రేవంత్ సర్కార్‌పై రామచందర్‌రావు ధ్వజం

Updated Date - May 26 , 2026 | 01:06 PM