Share News

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి సర్కార్ కృషి: ఎంపీ కేశినేని శివనాథ్

ABN , Publish Date - May 14 , 2026 | 12:09 PM

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్‌లో జేసీబీ వాహనాల ప్రారంభం ఆనందదాయకమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గతంలో ఈ ప్రాంత వాసులు అనేక సమస్యలతో ఇబ్బంది పడేవారన్నారు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి సర్కార్ కృషి: ఎంపీ కేశినేని శివనాథ్
Vijayawada Development

విజయవాడ, మే 14: అజిత్‌సింగ్ నగర్‌లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్‌లో 5 జేసీబీ వాహనాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్(వీఎంసీ) ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సెంట్రల్ నియోజకవర్గంలో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్‌లో జేసీబీ వాహనాల ప్రారంభం ఆనందదాయకమని అన్నారు. గతంలో ఈ ప్రాంత వాసులు అనేక సమస్యలతో ఇబ్బంది పడేవారన్నారు.


కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే బోండా ఉమా.. నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి కారణం ఎమ్మెల్యే ఉమా అనడంలో అతిశయోక్తి లేదన్నారు. డ్రైనేజ్‌లు, రోడ్లను సుందరీకరణగా తీర్చిదిద్దామన్నారు. గత ప్రభుత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చిన్న పనులు కూడా జరగలేదని విమర్శించారు. గ్రేటర్ విజయవాడ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. జేసీబీ యాజమాన్యానికి ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


అధికారం అలంకారం కాదు.. బాధ్యత: ఎమ్మెల్యే

bonda-uma.jpg

పార్లమెంట్ సభ్యులు నిరంతరం కేంద్రం నుంచి నిధులు తెస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. ప్రధాని, సీఎం.. ప్రతినెల స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటూ ప్రత్యేక దృష్టి పెడుతున్నారన్నారు. గతంలో చెత్తా చెదారంగా ఉన్న ఈ ప్రాంతాన్ని టీడీపీ ప్రభుత్వం.. చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా మారుస్తోందని అన్నారు. విజయవాడ నగర అభివృద్ధి ఎంపీ కేశినేని శివనాథ్ కృషికి నిదర్శనమన్నారు. రూ.23 కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అధికారం అలంకారం కాదని.. ఒక బాధ్యత అని బోండా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

సీఎం చంద్రబాబు, పవన్, లోకేశ్ బాటలోనే మంత్రులు

టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఆందోళనలు.. కర్నూలులో హైటెన్షన్

Read Latest AP News And Telugu News

Updated Date - May 14 , 2026 | 12:17 PM