బడా బాబుల పిల్లలే టార్గెట్‌గా డ్రగ్స్ విక్రయం.. ఇద్దరి అరెస్ట్
ABN , Publish Date - May 14 , 2026 | 11:30 AM
హైదరాబాద్‌లో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్‌బీ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఎండీఎంఏ, ఓజీ కుష్, చరస్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, మే 14: నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సూరారం- కొంపల్లి హైటెన్షన్ రోడ్‌లో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎస్టీఎఫ్‌బీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇన్నోవా కారులో డ్రగ్స్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో కారు ఆపిన అధికారులు.. తనిఖీలు చేపట్టగా డ్రగ్స్ బయటపడింది. నిందితులు నుంచి మూడు గ్రాములు ఎండీఎంఏ, 36 గ్రాముల ఓజీ కుష్, 7 గ్రాముల చరస్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.2.58 లక్షలు ఉంటుందని అంచనా.
బడా బాబుల పిల్లలే టార్గెట్‌గా డ్రగ్స్ అమ్మకాలు జరిపి.. నిందితులు భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఎస్టీఎఫ్‌బీ అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్‌తో పాటు కారును సీజ్ చేశారు. డ్రగ్స్‌ను ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఈ దందా నడిపిస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల వెనక పెద్ద ముఠా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి...
భద్రాద్రి రామయ్య ఆలయంలో మంత్రి తుమ్మల ప్రత్యేక పూజలు
Read Latest Telangana News And Telugu News