భద్రాద్రి రామయ్య ఆలయంలో మంత్రి తుమ్మల ప్రత్యేక పూజలు
ABN , Publish Date - May 14 , 2026 | 09:42 AM
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. పూజ్యులు ఎన్టీఆర్ పాలనలో భద్రాచలం రామాలయం అభివృద్ధి చేసే భాగ్యం దక్కిందని మంత్రి తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం, మే 14: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఈరోజు(గురువారం) ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ప్రత్యేక స్వాగతం పలికారు. శ్రీ సీతారామచంద్ర స్వామికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా తొలిసారి ఎన్టీఆర్ క్యాబినెట్‌లో ప్రమాణ స్వీకారం చేసి నేటికి నలభై ఏళ్ళు పూర్తి అయ్యాయి. 1986 మే 14 తేదీన తుమ్మల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

దర్శనానంతరం తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరాముడు అంటే భద్రాచలం అనేలా భక్త రామదాసు రామాలయం పునఃనిర్మాణం చేశారన్నారు. పూజ్యులు ఎన్టీఆర్ పాలనలో భద్రాచలం రామాలయం అభివృద్ధి చేసే భాగ్యం దక్కిందని తెలిపారు. రూ.351 కోట్లతో రామాలయం పునరాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారన్నారు. నలబై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో భద్రాద్రి రాముని ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయన్నారు. భద్రాచలం ప్రాంతం నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...
హైదరాబాద్.. పెరిగిన చిక్కుడు, బీరకాయ.. తగ్గిన దోస, వంకాయ
Read Latest Telangana News And Telugu News