Share News

Eyes: వేసవిలో మీ నేత్రాలను ఇలా సంరక్షించుకోండి...

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:16 AM

వేసవిలో ఎదురయ్యే కంటి సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ అగర్వాల్‌ ఐ హాస్పిటల్స్‌ క్లినికల్‌ సర్వీసెస్‌ రీజినల్‌ హెడ్‌ డాక్టర్‌ సౌందరి తెలిపారు. ఈ మేరకు వేసవిలో నేత్రాలకు ఎదురయ్యే సమస్యలను వివరిస్తూ తేలికపాటి చిట్కాలు పాటించాలని కోరారు.

Eyes: వేసవిలో మీ నేత్రాలను ఇలా సంరక్షించుకోండి...

చెన్నై: వేసవిలో ఎదురయ్యే కంటి సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ అగర్వాల్‌ ఐ హాస్పిటల్స్‌ క్లినికల్‌ సర్వీసెస్‌ రీజినల్‌ హెడ్‌ డాక్టర్‌ సౌందరి తెలిపారు. ఈ మేరకు వేసవిలో నేత్రాలకు ఎదురయ్యే సమస్యలను వివరిస్తూ తేలికపాటి చిట్కాలు పాటించాలని కోరారు. వేసవి కారణంగా కళ్ళల్లో తడి ఆరిపోతుందని, కంటి కలక వంటి వ్యాధులు కూడా వస్తాయని తెలిపారు. సూర్యుడి హానికరమైన కిరణాలు కూడా కళ్ళలో మంటలు పుట్టిస్తాయన్నారు. ఈ సమస్యల రాకుండా ఉండాలంటే కళ్లు తడారకుండా ఉండటానికి డాక్టర్లు సూచించే ఐడ్రాప్స్‌(Eyedrops) వాడాలని తెలిపారు.

nani2.jpg

ఇదికూడా చదవండి: Viral Video: హాస్టళ్లలో ఇలాంటి సమస్య కూడా రావొచ్చు.. పాపం..! ఇతడి పరిస్థితి ఏమైందంటే..

కళ్ళను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని, చేతులను తరచూ శుభ్రంగా కడగాలని, కాంటాక్ట్‌ లెన్స్‌లను అమర్చుకునే సమయాల్లో చేతులను శుభ్రంగా కడగాలన్నారు. యూవీ రక్షణతో కూడిన సన్‌గ్లాసెస్(Sunglasses) ధరించాలని, నిర్జలీకరణను నివారించడానికి తరచూ మంచినీటిని తాగాలని, రసాయనాలకు దూరంగా ఉండాలని, ఈతకొట్టేటప్పుడు స్విమ్మింగ్‌ గాగుల్స్‌ ధరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా ఎల్లప్పుడూ కంప్యూటర్‌, మొబైల్‌ గేమ్‌లు ఆడకుండా ఉంటే కళ్ళ సమస్యలు రావని ఆమె పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Kanniyakumari: ఒకే సమయంలో సూర్యాస్తమయం-చంద్రోదయం.. కన్నియాకుమారిలో అపురూప దృశ్యం

Read Latest National News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 11:16 AM