Share News

AP Politics: చింతమనేనికి చంద్రబాబు ఫోన్.. ఎందుకోసమంటే..

ABN , Publish Date - Apr 24 , 2024 | 08:30 AM

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) స్పీడ్ పెంచారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేతలకు బీఫామ్స్(B-Forms) అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు బీఫామ్స్ అందజేసిన పసుపు దళపతి.. తాజాగా చింతమనేని ప్రభాకర్‌కు(Chintamaneni Prabhakar) ఫోన్ చేశారు.

AP Politics: చింతమనేనికి చంద్రబాబు ఫోన్.. ఎందుకోసమంటే..
Chandrababu

అమరావతి, ఏప్రిల్ 24: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) స్పీడ్ పెంచారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేతలకు బీఫామ్స్(B-Forms) అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు బీఫామ్స్ అందజేసిన పసుపు దళపతి.. తాజాగా చింతమనేని ప్రభాకర్‌కు(Chintamaneni Prabhakar) ఫోన్ చేశారు. బీఫామ్ తీసుకునేందుకు రావాలని సమాచారం అందించారు. ప్రస్తుతం చంద్రబాబు శ్రీకాకుళంలో ఉండటంతో.. చింతమనేని శ్రీకాకుళం బయలుదేరారు. అయితే, మొన్ననే భారీ ర్యాలీతో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు చింతమనేని ప్రభాకర్. శ్రీకాకుళంలో ఇవాళ మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి బీఫామ్ తీసుకోనున్నారు.


వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో దెందులూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తితో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ముడిపడింది. దీంతో అనపర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ బీజేపీలో చేరి పోటీ చేయాలని చంద్రబాబు నచ్చజెప్పారు. అధినేత మాటతో అనపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి సోమవారం నాడు బీజేపీలో చేరారు. నల్లమిల్లి బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేస్తుండటంతో.. చింతమనేనికి లైన్ క్లియర్ చేసింది టీడీపీ. దెందులూరు టికెట్‌ను చింతమనేనికి కన్ఫామ్ చేసింది తెలుగుదేశం అధిష్టానం.

ఇదికూడా చదవండి: Lok Sabha Polls 2024: ఖమ్మం బరిలో ప్రియాంక?


దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్..

దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. దుగ్గిరాలలోని నివాసం నుంచి వందలాది బైకులతో ర్యాలీగా వెళ్లి.. నామినేషన్ వేశారు. అంతకు ముందు ప్రభాకర్ తొలుత ఆంజనేయస్వామి, రాట్నాలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆ తరువాత ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేశారు. ఇకపోతే దెందులూరు కూటమి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈసారి ఖచ్చితంగా తనదే గెలుపు అంటూ చింతమనేని ధీమా వ్యక్తం చేశారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2024 | 08:49 AM