Share News

Viral Video: అదేంటి.. కుక్కను చూసి మొసలి అంత వేగంగా పరిగెత్తింది.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:00 PM

సాధారణంగా మొసలి అంటే అత్యంత భయంకరమైన జంతువు. నీటిలోని మొసలి బలం ముందు ఏనుగు కూడా నిలవలేదు. అయితే అదంతా నీటిలో ఉన్నంతవరకే. బయటకు వస్తే కుక్క కూడా మొసలిని బయటపెట్టగలదు. వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆ మాటల నమ్మాల్సిందే.

Viral Video: అదేంటి.. కుక్కను చూసి మొసలి అంత వేగంగా పరిగెత్తింది.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!
pet dog scares off alligator

సాధారణంగా మొసలి (Alligator) అంటే అత్యంత భయంకరమైన జంతువు. నీటిలోని మొసలి బలం ముందు ఏనుగు కూడా నిలవలేదు. అయితే అదంతా నీటిలో ఉన్నంతవరకే. బయటకు వస్తే కుక్క కూడా మొసలిని బయటపెట్టగలదు. వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆ మాటల నమ్మాల్సిందే. ఆ వీడియోలోని ఓ పెంపుడు కుక్క (Pet Dog) అరుపులకు భయపడిన మొసలి (Crocodile Videos) అత్యంత వేగంగా పారిపోయింది. అమెరికాలోని ఫ్లోరిడాలో (Florida) ఈ ఘటన జరిగింది (Viral Video).


natalia_rojas అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఇంటి డోర్ దగ్గరకు ఓ మొసలి వచ్చి నిల్చుంది. ఇంట్లోని మహిళ ఆ మొసలిని చూసి భయంతో గోడ పక్కన దాక్కుంది. అంతలో ఆమె పెంపుడు కుక్క పింటో అక్కడకు వచ్చి మొసలిని చూసింది. తలుపునకు ఇవతల నిల్చుని ఆ మొసలిని చూసి అరిచింది. ఆ అరుపులు విన్న మొసలి భయంతో వెనక్కి తిరిగి సరస్సు వైపు వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను మూడు లక్షల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఫ్లోరిడాలో ఇలాంటివి సర్వసాధారణమే``, ``చెరువు పక్కన ఇల్లు ఉన్న వారు ఈ సమస్యను ఎదుర్కోక తప్పదు``, ``ఆ కుక్కను చెరువు దగ్గరకు వెళ్లనివ్వకూడదు``, ``ఆ మొసలి చాలా వేగంగా పరిగెత్తింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: బాయ్‌ఫ్రెండ్‌కు ఫోన్లు, మెసేజ్‌లు.. లిఫ్ట్ చేయకపోతే వింత పనులు.. చివరకు డాక్టర్లు ఏం తేల్చారంటే..


Viral Video: ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూడలేదే.. వేడి నుంచి ఉపశమనం కోసం డ్రైవర్ ఏం చేస్తున్నాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 24 , 2024 | 04:19 PM