చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయానికి పోటేత్తిన భక్తులు
ABN, Publish Date - Jan 01 , 2026 | 02:08 PM
నూతన సంవత్సరం పురస్కరించుకుని హైదరాబాద్ మహానగరంలోని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. గురువారం తెల్లవారుజాము నుంచే భక్తులతో దేవాలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. పాతబస్తీ చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ దేవాలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. ఏడాది ప్రారంభం.. తొలి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందకు భక్తులు భారీగా తరలి వచ్చారు.
నూతన సంవత్సరం పురస్కరించుకుని హైదరాబాద్ మహానగరంలోని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. గురువారం తెల్లవారుజాము నుంచే భక్తులతో దేవాలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. పాతబస్తీ చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ దేవాలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
ఏడాది ప్రారంభం.. తొలి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దాంతో చార్మినార్ ఆ పరిసర ప్రాంతాలు వారితో నిండి పోయాయి.
రహదారిపై క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి.
భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని బంతి పూలతో అందంగా అలంకరించారు.
చార్మినార్ పరిసర ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి.
ఇక చార్మినార్ పరిసర ప్రాంతాలలో షాపింగ్ చేసేందుకు కొనుగోలు దారులు ఈ రోజు ఉదయమే పాతబస్తీకి చేరుకున్నారు. గాజులు, ముత్యాల దుకాణాలు మహిళలతో నిండిపోయాయి.
Updated Date - Jan 01 , 2026 | 02:09 PM