ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ananthapuram News: గుంతకల్లులో సైకో వీరంగం..

ABN, Publish Date - Jan 01 , 2026 | 11:30 AM

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. టూటౌన్‌ పోలీస్ స్టేషన్‏లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మున్వర్‌ బాబా గాయపడ్డాడు. గత కొద్దిరోజులుగా పట్టణంలో పలువురిని గాయపరిచినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.

గుంతకల్లు(అనంతపురం): పట్టణంలో ఓ సైకో బుధవారం వీరంగం సృష్టించాడు. అతడి చేతిలో టూటౌన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మున్వర్‌ బాబా గాయపడ్డారు. గత కొన్ని రోజులుగా సుమారు 27 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని యువకుడు పట్టణంలో తిరుగుతుండేవాడు. సాయంత్రం పోర్టర్‌లైన్‌లో కనబడిన యువకులను కర్రతో చితకబాదాడు. కొందరు యువకులు అతన్ని పట్టుకోవడానికి వెళ్లగా.. పరగెత్తుకుంటూ ధర్మవరం(Darmavaram) గేట్‌ రోడ్డు, మెయిన్‌ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌ వరకు వచ్చాడు.

అక్కడ బాలికలను కర్రతో కొట్టడానికి వెళ్తుండగా బస్టాండ్‌లో విధి నిర్వహణలో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ మున్వర్‌ బాబా అడ్డుకునేందుకు వెళ్లారు. ఒక్కసారిగా అతడి చేతిలో ఉన్న కర్రతో తలపై కొట్టాడు. తీవ్ర రక్తగాయాలైన మున్వర్‌ బాబాను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత పెట్రోల్‌ బంకు సమీపంలో సైకోను పట్టుకుని జనం చితకబాదారు. తీవ్ర రక్త గాయాలతో అతడు కిందపడిపోయాడు. అనంతరం అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి-2' షూటింగ్‌కు డార్లింగ్!

రానూపోనూ టికెట్లు బుక్‌ చేస్తే 10శాతం రాయితీ

Read Latest Telangana News and National News

Updated Date - Jan 01 , 2026 | 11:30 AM