ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Year End 2025: ఈ ఏడాది ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో తెగ ట్రెండ్ అయిన సంఘటనలు ఇవే..

ABN, Publish Date - Dec 24 , 2025 | 06:19 PM

మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టపోతున్నాం. ఈ సందర్భంగా ఈ ఏడాది ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో బాగా వైరల్ అయిన వీడియోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రీల్స్ అనేది యువకులందరికీ దినచర్యగా మారింది. ఇన్‌‌స్టా, ఫేస్‌బుక్‌లలో రోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో వాటిలో కొన్ని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. మరికొన్ని లక్షలు, కోట్లలో వ్యూస్‌ను సొంతం చేసుకుంటుంటాయి. మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టపోతున్నాం. ఈ సందర్భంగా ఈ ఏడాది ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో బాగా వైరల్ అయిన వీడియోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

‘ఉయి అమ్మ’ డాన్స్ వీడియో..

ఆజాద్ సినిమాలోని ఉయి అమ్మ డాన్స్ వీడియో ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లతో తెగ వైరల్ అయింది. ఈ పాటకు చాలా మంది రీల్స్ చేసి నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆ పాట మరింత మందికి రీచ్ అయింది. ఈ పాట రాషా తడాని అనే నటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పాట ఇప్పటికీ నెటిజన్లను అలరిస్తూనే ఉంది.

జైపూర్ హోటల్ ఘటన..

రాజస్థాన్‌ జైపూర్‌‌లోని హోటల్ గదిలో ఓ జంట ఏకతంగా కడిపిన దృశ్యాలు కిటికీ అద్దాల నుంచి బయటికి కనిపించడం సంచలనం కలిగించింది. దీంతో ఆ హోటల్ ముందు ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఆ జంట ఎవరనేది తెలియకున్నా ఇలా కస్టమర్ల గోప్యతను కాపాడడంలో హోటల్ యాజమాన్యం విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇన్‌స్టా, ఫేస్‌బుక్ తదితర వేదికల్లో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బేబీడాల్ అర్చితాపై ఆరోపణలు..

అసోంకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బేబీడాల్ అర్చితా ఫుకాన్‌పై ఆధారాలు లేని ఆరోపణలు ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో తెగ వైరల్ అయ్యాయి. అమెరికా అడల్ట్ స్టార్‌తో ఆమె ఫొటో దిగినట్లుగా ఉన్న దృశ్యం.. ఇన్‌‌స్టా, ఫేస్‌బుక్‌లలో తెగ వైరల్ అయింది. దీంతో ఆమెకు రాత్రికి రాత్రే ఫాలోవర్లు లక్షల్లో పెరిగిపోయారు. ఆ ఫొటోపై సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ స్పందిస్తూ.. ఆ ఘటనపై తానూ స్పందించననని, తన నిశ్శబ్దమే బిగ్గరగా మాట్లాడుతుందని సమాధానం ఇచ్చింది.

19 నిమిషాల వీడియో..

ఇన్‌స్టాగ్రామ్‌లో 19 నిముషాల వీడియో హ్యాష్‌ట్యాగ్ ఈ ఏడాది సంచలనం సృష్టించింది. ఓ జంట హోటల్ గదిలో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోపై అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఈ వీడియోలో ఉన్నది తాము కాదంటూ సదరు జంట క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియో కూడా అసత్యమని తేలింది. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం ఈ ఏడాది తెగ వైరల్ అయింది.

వన్ గర్ల్ వన్ అనకొండ..

వన్ గర్ల్ వన్ అనకొండా అనే టైటిల్‌తో ఉన్న ఓ యువతి వీడియో ఈ ఏడాది తెగ ట్రెండింగ్ అయింది. సదరు యువతి బాత్‌టబ్‌లో అనకొండతో కలిసి స్నానం చేయడం చూసి అంతా షాక్ అయ్యారు. ఆమె భయపడకపోగా అనకొండకు ముద్దు పెడుతూ నవ్వుతూ కనిపిస్తుంది. చివరకు ఇవి పాత వీడియోలతో రూపొందిన క్లిక్‌బైట్ కంటెంట్‌గా తేలింది. ఏది ఏమైనా వన్ గర్ల్ వన్ అనకొండ అనే హ్యాష్‌ట్యాగ్ తెగ ట్రెండ్ అయింది.

జన్నత్ తోహా వీడియోపై అనుమానాలు

బంగ్లాదేశీ ఇన్‌ఫ్లుయెన్సర్ జన్నత్ తోహా పేరుతో ఉన్న 3 నిముషాల 21 సెకండ్ల వీడియో ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో తెగ వైరల్ అయింది. అందులో ఆమె తన భాగస్వామితో కలిసి ఉండడంతో పాటూ ప్రైవేట్ దృశ్యాలు కూడా బయపడడం సంచలనం సృష్టించింది. దీంతో ఈమె పేరు ఒక్కసారిగా ట్రెండింగ్‌గా మారింది. ఈ అంశంలో కొందరు ఆమెకు మద్దతు ఇవ్వగా మరికొందరు ఆమెను వ్యతిరేకించారు. తర్వాత ఆ వీడియోకు, ఆమెకు సంబంధం లేదని తేలింది. ఇన్‌ఫ్లుయెన్సర్ పేర్లను ఉపయోగించి ట్రాఫిక్ పెంచుకునే ప్రయత్నాలు పెరుగుతున్నాయని ప్రచారం జరిగింది.

త్రిషా కర్ మధు డాన్స్ రీల్

భోజ్‌పురి నటి త్రిషా కర్ మధు చేసిన డాన్స్ రీల్ వీడియో కూడా తెగ వైరల్ అయింది. నలుపు, తెలుపు దుస్తులలో ఆమె చేసిన డాన్స్ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. ఈ వీడియో పోస్ట్ చేసిన నిమిషాల్లోనే వైరల్ అయింది. భోజ్‌పురి పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న త్రిషకర్.. ఈ వీడియోతో మరోసారి తన అభిమానులను అలరించింది.

ఇమ్షా రెహమాన్‌పై సెర్చ్ ట్రెండ్స్

పాకిస్తాన్ లాహోర్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమ్షా రెహమాన్‌కు సంబంధించి ఈ ఏడాది ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో తెగ సెర్చ్ చేశారు. ఇమ్షా వీడియోలో ఓ అబ్బాయితో అభ్యంతరకరమైన స్థితిలో కనిపించింది. ఈ వీడియోలు వైరల్ అవడంతో చివరకు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను డీయాక్టివేట్ చేసింది. అయితే ఆ వీడియోను ఫేక్ అని, ఎవరో కావాలనే ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆమె తెలిపింది. ఈ క్రమంలో ఇన్‌‌స్టా, ఫేస్‌బుక్ తదితర వేదికల్లో ఆమె పేరును తెగ సెర్చ్ చేశారు.

బంగ్లాదేశ్ నేర వీడియో..

బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక నేరానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై నెటిజన్ల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దైవదూషణ చేశాడని ఆరోపిస్తూ ఒక గుంపు.. సదరు వ్యక్తిని కొట్టి చంపింది. దీనిపై పోలీసులు పలువురిని అరెస్ట్ కూడా చేశారు.

మరియం ఫైసల్‌‌పై ఆరోపణలు..

పాకిస్తానీ టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ మరియం ఫైసల్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఆ వీడియోలో ఫైసల్ లాంటి అమ్మాయి ఒక పురుషుడితో సన్నిహితంగా ఉన్నట్లు కనిపించింది. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ ట్రెండింగ్ అయింది. నిర్ధారణ లేని సమాచారాన్ని పదేపదే ప్రచారం చేయడం వల్ల అది నిజంగా భావించబడుతుందనే విషయం.. ఈ వీడియోతో మరోసారి రుజువైంది.

Updated Date - Dec 24 , 2025 | 06:20 PM