RBI Gold Reserves: ఆర్బీఐ వద్ద భారీగా బంగారం..ఎన్ని టన్నులంటే?
ABN, Publish Date - Oct 23 , 2025 | 09:41 PM
పసిడిని ఎంత ఎక్కువ నిలువ చేసుకుంటే అంతగా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని సెంట్రల్ బ్యాంకులు నమ్ముతాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకున్న అస్థిరత్వం కారణంగా మన ఆర్బీఐ కూడా బంగారం కొనే వేగాన్ని పెంచింది. దీని ఫలితంగా ఆర్బీఐ వద్ద ఏకంగా 880 మెట్రిక్ టన్నుల మైలురాయిని దాటింది.
జాతీయం, అక్టోబర్ 23: బంగారం అంటే అందరికీ ఇష్టమే. మరీ ముఖ్యంగా మహిళలు అయితే పసిడిపై ప్రేమ ఎక్కువ ఉంటుంది. అలానే అత్యవసర సమయాల్లో బంగారం ఆర్థికంగా ఉపయోగపడుతుంది. అందుకే ఎక్కువ మంది దీన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అలానే పసిడిని ఎంత ఎక్కువ నిలువ చేసుకుంటే అంతగా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని సెంట్రల్ బ్యాంకులు నమ్ముతాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకున్న అస్థిరత్వం కారణంగా మన ఆర్బీఐ(RBI Gold) కూడా బంగారం కొనే వేగాన్ని పెంచింది. దీని ఫలితంగా ఆర్బీఐ వద్ద ఏకంగా 880 మెట్రిక్ టన్నుల మైలురాయిని దాటింది. ఆర్బీఐ విడుదల చేసిన తాజాగా నివేదిక ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలోని ఈ తొలి 6 నెలల్లో మొత్తం 600 కిలోల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. మరి..ఆర్బీఐ(RBI) భారీగా బంగారం నిల్వలు ఉంచింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వీడియోను వీక్షించండి.
ఇవి కూడా చదవండి:
Tejashwi Yadav: డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో రాష్ట్రంలో అవినీతి: తేజస్వి యాదవ్
MNM leader Snehan: అసెంబ్లీ ఎన్నికలు.. భీకర యుద్ధమే
Updated Date - Oct 23 , 2025 | 09:41 PM