Tejashwi Yadav: డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో రాష్ట్రంలో అవినీతి: తేజస్వి యాదవ్
ABN , Publish Date - Oct 23 , 2025 | 01:04 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిహార్‌ను పునర్నిర్మిస్తామని ఆర్జెడి నేత తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ పాలనలో అవినీతి పేరుకుపోయిందని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్‌లో రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం, కేంద్రంలో అసమర్థ ప్రభుత్వం నడుస్తోందని దుయ్యబట్టారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 23: బిహార్ అసెంబ్లీ ఎన్నికలో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జెడి నేత తేజస్వి యాదవ్‌ను మహాఘట్బంధన్ కూటమి ఢిల్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తేజస్వి యాదవ్ స్పందించారు. తమను సీఎం అభ్యర్థిగా ప్రకటించినందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిహార్‌ను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ పాలనలో అవినీతి పేరుకుపోయిందని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్‌లో రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం, కేంద్రంలో అసమర్థ ప్రభుత్వం నడుస్తోందని దుయ్యబట్టారు.
ఎన్డీఏ కూటమి ఇంతవరకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో అనేది ఎందుకు ప్రకటించలేదు? అని ప్రశ్నించారు. ఎందుకు నితీష్ కుమార్ పేరుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందన్నారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, విధాన సభ సభ్యులు.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంచుకుంటారని అన్నారు. గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్‌ను ప్రకటించారని.. ఇప్పుడు ఎందుకు ప్రకటించడం లేదు? అని ప్రశ్నించారు. నితీష్ కుమార్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది కాబట్టే ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
Tejashwi Yadav: సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్
Encounter In Delhi: ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. గ్యాంగ్‌స్టర్లు హతం