Share News

MNM leader Snehan: అసెంబ్లీ ఎన్నికలు.. భీకర యుద్ధమే

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:55 AM

రాష్ట్ర చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడానికి ముందే ప్రధాన పార్టీలు ప్రచారం చేయడాన్ని చూస్తుంటే వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు భీకరయుద్ధాన్ని తలపించేలా జరగటం ఖాయమని ప్రముఖ సినీ గేయరచయిత, ఎంఎన్‌ఎం నేత స్నేహన్‌ అన్నారు.

MNM leader Snehan: అసెంబ్లీ ఎన్నికలు.. భీకర యుద్ధమే

- ఎంఎన్‌ఎం నేత స్నేహన్‌

చెన్నై: రాష్ట్ర చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడానికి ముందే ప్రధాన పార్టీలు ప్రచారం చేయడాన్ని చూస్తుంటే వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు భీకరయుద్ధాన్ని తలపించేలా జరగటం ఖాయమని ప్రముఖ సినీ గేయరచయిత, ఎంఎన్‌ఎం నేత స్నేహన్‌(MNM leader Snehan) అన్నారు. బుధవారం ఆయన కుటుంబ సమేతంగా తిరుచెందూరు(Tiruchendur) ఆలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకూ జరిగిన అసెంబ్లీ ఎన్నికలకంటే వచ్చే యేడాది జరిగే ఎన్నికలే వైవిధ్య భరితంగా ఉంటాయని తెలిపారు.


nani1.3.jpg

సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్‌కు నెల లేదా రెండు నెలల ముందు ప్రధాన పార్టీలు ప్రచారం ప్రారంభించడం ఆనవాయితీ, ప్రస్తుతం ఓ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసిందని, మరో ప్రధాన పార్టీ ఎన్నికలకు పది నెలలకు ముందే జాతీయ పార్టీతో పొత్తు ఖరారు చేసుకుని నియోజకవర్గాల వారీగా ప్రచారం ప్రారంభించిందని, వీటన్నింటిన పరిశీలిస్తే వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు భీకరయుద్ధంలా రసవత్తరంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు.


nani1.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..

మావోయిస్టు మద్దతుదారులపై నజర్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 23 , 2025 | 11:56 AM