ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇండిగో సర్వీసులు రద్దు కావడానికి కారణం ఇదే..!

ABN, Publish Date - Dec 06 , 2025 | 05:56 PM

ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ రేపటిలోగా డబ్బులు రిఫండ్ చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు.

ఢిల్లీ, డిసెంబరు6 (ఆంధ్రజ్యోతి): ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇవాళ(శనివారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు కేేంద్ర మంత్రి . టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ రేపటిలోగా డబ్బులు రిఫండ్ చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అంశం పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.


కేవలం ఇద్దరే ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు ఉండటంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు. డీజీసీఏ తరఫున ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ప్రస్తావించారు. దీనికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. విమాన టికెట్ ధర గరిష్ఠంగా రూ.18వేలు మించొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. టికెట్‌ ధరలను నాలుగు కేటగిరీలుగా మంత్రిత్వ శాఖ విభజించిందని తెలిపారు. 500 కిలోమీటర్లకు ఒక రేటు, 500 నుంచి 1000 కిలో మీటర్లకు ఇంకో రేటు ఉంటుందని మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

Updated Date - Dec 06 , 2025 | 06:41 PM