ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu: విజన్ 2020 నుంచి విజన్ 2047 వరకు.. అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు అమరావతి

ABN, Publish Date - Apr 20 , 2025 | 09:29 AM

హైదరాబాద్‌లో హైటెక్ సిటీని కేవలం 13 నెలల్లో నిర్మించాలని సంకల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయించగలిగారు. ప్రజాల శ్రేయస్సే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విజన్ 2020 పేరుతో ఇరవై ఏళ్ల భవిష్యత్తుకు ప్రణాళికను సిద్ధం చేశారు.

హైదరాబాద్‌లో హైటెక్ సిటీని కేవలం 13 నెలల్లో నిర్మించాలని సంకల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయించగలిగారు. ప్రజాల శ్రేయస్సే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విజన్ 2020 పేరుతో ఇరవై ఏళ్ల భవిష్యత్తుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఐటీ రంగం అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజుల్లో చంద్రబాబు దూరదృష్టితో దాన్నిహైదరాబాద్‌కు తీసుకురాగలిగరు. అమెరికాలో పర్యటించి ఎక్కినమెట్లు ఎక్కకుండా మేటీ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకురాగలిగారు. యువతకు కళ్లు చెదిరే జీతాలు రావడం వెనుక చంద్రబాబు ముందు చూపు దాగుంది. అదే రైతు బిడ్డలను రత్నాలుగా మార్చింది. మారుమూల గ్రామాలకు సైతం ఐటీరంగం పరిచయం అయింది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుది. ప్రభుత్వంలో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం మార్గాలు అన్వేషించారు.


ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలతో రాష్ట్రాన్ని మందుకు నడిపించారు. ప్రతిపక్షంలో ఉంటూ చాలా పోరాటాలు చేశారు. వ్యక్తిగత జీవితం పక్కనపెట్టి రోజుకు 18 గంటలు పనిచేశారు. చేనేత కార్మికులు, ఏరువుల కొరత, విద్యుత్ కొరత, మైక్రో ఫెనాన్స్ వేధింపులు, ఖనిజ సంపద దోపిడీ, భూ పందేరాలు, సెజ్‌లు, మద్యం అమ్మకాలు, క్రాప్ హాలీడే, నిత్యవస్తువుల ధరలు, ప్రజాధనం దోపిడీ వంటి సమస్యలపై చంద్రబాబు వీరోచిత పోరాటం జరిపారు. ప్రతిపక్ష నాయకుడిగా 2008 ఏప్రిల్ 21వ తేదీ నుంచి 2008 ఆగస్టు 15వ తేదీ వరకు మీకోసం యాత్ర ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 117 రోజులు పర్యటన చేశారు. తెలంగాణ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో 18 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుభూమిగా మారేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే దానిని ఆపాలని పెద్దఎత్తున ఉద్యమం చేసి మహారాష్ట్రాలో అరెస్ట్ అయి మూడు రోజుల పాటు అక్కడే పోలీస్ స్టేషన్‌లో చంద్రబాబు ఉన్నారు.


దేశ రాజకీయ చరిత్రలో ఏరాజకీయ నాయకుడు చేయలేని విధంగా 64 ఏళ్ల వయస్సులో చంద్రబాబు అనారోగ్యాన్నిసైతం లెక్కచేయకుండా 208 రోజులు 2817 కిలోమీటర్లు పాదయాత్రతో ప్రజలను చైతన్య పరిచారు. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడంతో పాటు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదుకునే నైజంతో నేను ఉన్నానంటూ భరోసా కల్పిస్తూ చంద్రబాబు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. పదేళ్ల కాలంలో కాంగ్రెస్, వైసీపీ దుర్మార్గాలకు, దుశ్చర్యలకు 300 మంది బలైన వెరవకుండా పార్టీ జెండాను మోస్తూ సమయాన్ని, ప్రాణాన్ని పణంగా పెట్టి నిరంతరం కార్యక్రమాల్లో పాల్గొంటున్న కార్యకర్తల రుణం తీర్చుకోవడానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు మహానాడులో ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయకర్తగా నారా లోకేష్‌ను నియమించారు. సంక్షేమ నిధి ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరగాలన్న ఉద్దేశ్యంతోనే లోకేష్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలు పెంచి వారిని సమర్థులైన నాయకులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో నాయకత్వ శిక్షణా శిబిరం పేరిట ప్రకాశం జిల్లా కందుకూరు, చిత్తూరు జిల్లా తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల, విజయనగరం జిల్లాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించారు.


పూర్తి వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి...

మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి

TTD Donation Management: గోవిందుడి ఖజానా మరింత భద్రం

Minister NMD Farooq: మైనార్టీలకిచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యం

Kasireddy Rajasekhar Reddy: ముందస్తు బెయిలివ్వండి అరెస్టు నుంచి కాపాడండి

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 09:40 AM