Minister NMD Farooq: మైనార్టీలకిచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యం
ABN , Publish Date - Apr 19 , 2025 | 05:41 AM
మినారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రూ.30 కోట్లు పాస్టర్ల ఖాతాల్లోకి జమ చేసింది. ఒక్కో పాస్టర్‌కు రూ.35వేలు చొప్పున గౌరవ వేతనం మంజూరు చేశారు

పాస్టర్లకు రూ.30కోట్ల గౌరవ వేతనం జమ: మంత్రి ఫరూక్
అమరావతి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): మైనార్టీలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాస్టర్లకు ఒకేసారి 7నెలల గౌరవ వేతనం కింద రూ.30 కోట్లు విడుదల చేయడమే కాకుండా, 24 గంటల లోపలే ఆ మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.35వేల మొత్తాన్ని జమ చేశామని పేర్కొన్నారు. క్రైస్తవులకు పవిత్రమైన గుడ్ ఫ్రైడే రోజున పాస్టర్లకు సంబంధించిన గౌరవవేతనాన్ని విడుదల చేసిన కూటమి ప్రభుత్వం.. ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మద్దిరాల జోసఫ్ ఇమ్యాన్యూల్ పేర్కొన్నారు.