Lalu Yadav’s Daughter: నాపై చెప్పులతో దాడి చేయబోయారు..!
ABN, Publish Date - Nov 16 , 2025 | 04:49 PM
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఇంట్లో విభేదాలు చెలరేగాయి. తాను ఆర్జేడీ పార్టీ, కుటుంబం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన ఆయన కుమార్తె రోహిణి ఆచార్య.. తాజాగా తన సోదరుడు తేజస్విపై తీవ్ర ఆరోపణలు చేశారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఇంట్లో విభేదాలు చెలరేగాయి. తాను ఆర్జేడీ పార్టీ, కుటుంబం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన ఆయన కుమార్తె రోహిణి ఆచార్య.. తాజాగా తన సోదరుడు తేజస్విపై తీవ్ర ఆరోపణలు చేశారు. తేజస్వితో పాటూ ఆయన సహాయకులే కుటుంబం నుంచి బయటికి పంపించినట్లు ఎక్స్‌లో వరుస పోస్టులు చేశారు. తనని కొట్టేందుకు చెప్పులు ఎత్తారని ఆమె వాపోయారు. తన ఆత్మగౌరవం విషయంలో రాజీ పడలేను అని తెలిపారు. తన తల్లి ఇంటిని వదిలేసి వెళ్లిపోవాల్సి వచ్చిందని, ఇప్పుడు తనను కూడా అనాథను చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Nov 16 , 2025 | 04:49 PM