మొంథా ఎఫెక్ట్.. గోదావరి, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు..
ABN, Publish Date - Oct 28 , 2025 | 01:46 PM
వర్షాలకు వెయ్యి హెక్టర్లలో వరి, వేరుశెనగ, మినుము, పెసర, కూరగాయల పంటలు నీటమునిగాయి. మరోవైపు రహదారులు జలమయం అయ్యాయి.
విశాఖ: మొంథా తఫాన్ కారణంగా.. గోదావరి, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలకు డ్యాంలు, నదులు, రిజర్వాయర్లు, వాగులు, వంకలు, కాలువలు నిండుకుండుల్లా మారాయి. వర్షాలకు వెయ్యి హెక్టర్లలో వరి, వేరుశెనగ, మినుము, పెసర, కూరగాయల పంటలు నీటమునిగాయి. భారీ వర్షాల కారణంగా రహదారులు జలమయం అయ్యాయి. పలు కాలనీల ప్రజలు జలదిగ్బంధంలో ఇరుక్కుపోయారు. మరోవైపు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పరిస్థితులపై అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ.. ప్రజలను పర్యవేక్షిస్తున్నారు.
Updated Date - Oct 28 , 2025 | 01:48 PM