పోలీసుల అదుపులో దువ్వాడ జంట..
ABN, Publish Date - Dec 12 , 2025 | 10:38 AM
దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ఫాంహౌస్‌లో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై దువ్వాడ జంటపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రంగారెడ్డి, డిసెంబర్ 12: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న మద్యం పార్టీపై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన భార్య మాధురి పుట్టిన రోజు వేడుకలను నిబంధనలు పాటించకుండా వైసీపీ నేతలతో కలిసి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఎస్వోటీ పోలీసుల దాడుల్లో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని దువ్వాడ శ్రీనివాస్ , మాధురి సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీ ఆర్గనైజర్ పార్థసారథి, ఫామ్‌హౌస్ ఓనర్ సుభాష్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి...
హామీలు ఇవ్వడమే తప్ప ప్రభుత్వం నెరవేర్చిందేమీ లేదు..
బస్సు ప్రమాదంపై వెంటనే సహాయక చర్యలు చేపట్టాం: కలెక్టర్ దినేష్ కుమార్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 12 , 2025 | 11:44 AM