ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Spiny Gourd Recipes: ఆకాకరకాయతో రుచికరమైన ఊరగాయ..

ABN, Publish Date - Aug 23 , 2025 | 01:38 PM

వర్షాకాలంలో విరివిగా దొరికే ఆకాకరకాయలను ఇష్టపడనివారు ఉండరు. వీటినే కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయలు, బొంత కాకరకాయలని కూడా పిలుస్తుంటారు. వీటితో వేపుడు, ఇగురు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇవికాక ఆకాకరకాయలతో తయారుచేసే విభిన్న వంటకాలు కూడా ఉన్నాయి.

ఆకాకరకాయ ఊరగాయ

కావాల్సిన పదార్థాలు

ఆకాకరకాయలు- పావు కేజీ, కారం- ముప్పావు కప్పు, ఉప్పు- పావు కప్పు, ఆవపిండి- పావు కప్పు, మెంతిపిండి- పావు చెంచా, వెల్లుల్లి రెబ్బలు- పది, నువ్వుల నూనె- ఒకటిన్నర కప్పులు, నిమ్మరసం- పావు కప్పు

తయారీ విధానం..

  • ఆకాకరకాయలను నీళ్లతో శుభ్రంగా కడిగి తడిలేకుండా పొడి గుడ్డతో తుడవాలి. వీటిని ఒక రోజంతా ఆరనివ్వాలి. తరవాత ఒక్కోదాన్ని పొడవుగా నాలుగు ముక్కలుగా కోయాలి. ఒక గిన్నెలో కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి వేసి కలిపి ఉంచుకోవాలి.

  • వెడల్పాటి గిన్నెలో ఆకాకరకాయల ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కారం మిశ్రమం వేసి కలపాలి. తరవాత నువ్వుల నూనె పోసి ముక్కలకు కారం బాగా పట్టేలా కలపాలి. ముక్కల మీద నూనె తేలుతూ ఉండాలి. తరవాత నిమ్మరసం వేసి మరోసారి బాగా కలపాలి. ఈ గిన్నెమీద మూతపెట్టి ఒక రోజంతా ఊరనివ్వాలి. తరవాత ఉప్పు సరిచూసుకుని గాజు సీసాలో భద్రపరిస్తే ఈ ఆకాకరకాయ ఊరగాయ రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఊరినకొద్దీ దీని రుచి పెరుగుతుంది. వేడి అన్నం, ఇడ్లీ, దోశల్లోకి బాగుంటుంది.

చిట్కాలు

  • కల్లుప్పును కొద్దిసేపు ఎండలోపెట్టి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి కలిపితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నిమ్మరసాన్ని కూడా గంటసేపు ఎండలో ఉంచాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

రాజధానిలో మౌలిక వసతులేవి..

Updated Date - Aug 23 , 2025 | 01:41 PM